Kitchenvantalu

Brinjal Gravy Curry:స్పెషల్ వంకాయ గ్రేవీ కర్రీ.. అన్నం,చపాతీ, పులావ్ లోకి సూపర్ గా తినేయచ్చు

Brinjal Gravy Curry: వంకాయ వంటి కూర రుచి, మరే కూరగాయలతో పోల్చలేం. ఎన్ని స్పెషల్స్ చేసుకున్నా, చెయ్యి వంకాయ కర్రీ వైపే వెళ్తుంది. ఎలా చేసినా వంకాయ వంకాయే..రాయలసీమ స్టైల్లో పంకాయ గ్రేవీ కర్రీ ట్రై చేద్దాం.

కావాల్సిన పదార్థాలు
నూనె – 6 టేబుల్ స్పూన్స్
తరిగిన ఉల్లిపాయలు -1 కప్పు
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్స్
ఉప్పు – తగినంత
జీలకర్ర – 1 టీస్పూన్
పచ్చిమిర్చి – 2
టామాటా -2
పసుపు – 1/4టీ స్పూన్
తురిమిన కొబ్బరి – 1/4కప్పు
ఆవాలు – 1 స్పూన్
కరివేపాకు -2 రెమ్మలు
వెల్లుల్లి రెబ్బలు -10
మిరియాలు – 1 స్పూన్
కారం – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్స్
వంకాయలు – 10 -12
చింతపండు గుజ్జు – 1/3 కప్పు
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.స్టవ్ పై బాండీ పెట్టుకుని, అందులోకి ఆయిల్ వేసుకుని, వేడెక్కిన తర్వాత ,జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వేసుకుని,అందులోకి టమాటాలు వేసుకుని, మెత్త పడేవరకు ఉడికించాలి.
2. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసి, కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుని, మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అదే బాండీలోకి ఆయిల్ వేసి, ఆవాలు, జీలకర్ర,ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
4. ఉల్లిపాయలు వేగాక, వంకాయ ముక్కలు వేసుకుని, తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకుని, ముక్కలు మెత్త పడే వరకు ఉడికించాలి.

5. వంకాయ కాస్త మెత్తపడిన తర్వాత, కారం, ధనియాల పొడి వేసి, వేపుకోవాలి.
6. తర్వాత చింతపండు పులుసు కలుపుకుని, నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు నూనె పైకి తేలాక తయారు చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకుని, మూత పెట్టి, లో ఫ్లేమ్ పై ఉడికించాలి.
8. ఇప్పుడు గ్రేవీ కాస్త దగ్గరపడ్డాక , కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాయలసీమ సీమ స్టైల్ వంకాయ గ్రేవీ కర్రీ రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News