Healthhealth tips in telugu

Honey For Diabetes :షుగర్ ఉన్నవారు తేనె వాడవచ్చా… వాడితే ఏమి అవుతుందో..!

Honey And Diabetes Food :డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆహారం అనేది డయాబెటిస్ నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనే వాడితే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

సహజసిద్ధమైన తేనె తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. స్వచ్ఛమైన తేనెలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటం వలన వ్యవస్థను హానికరమైన బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనెతో తీసుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

చాలామంది పంచదారకు బదులు తేనెను వాడితే మంచిదని అనుకుంటారు. అలా తేనె వాడటం వల్ల ఉపయోగం ఉండదు. పంచదార, తేనె రెండూ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తాయి.

అలాగే తేనెకు, పంచదారకు ఉన్నంత ప్రాసెసింగ్ ఉండదు.. కాబట్టి పంచదారతో పోలిస్తే తేనె కాస్త బెటర్. అయినా తేనె వాడమని డయాబెటిక్ రోగులకు డాక్టర్స్ రిఫర్ చేయరు.

పంచదారతో పోలిస్తే తేనెలో కొంచెం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. తేనె వాడాలంటే డయాబెటిక్ రోగులు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News