Healthhealth tips in telugu

Migraine:విపరీతమైన తలనొప్పి వస్తుందా?.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Migraine Headache :మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా అలసట కలుగుతుంది. ఏ పని మీద దృష్టి ఉండదు. ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఒక రోజు ఉండవచ్చు. అలాగే రెండు రోజులు ఉండవచ్చు. ఈ విధంగా తరచుగా తలనొప్పి వస్తూ ఉంటే అశ్రద్ద చేయకుండా తప్పనిసరిగా డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఈ మైగ్రేన్ తలనొప్పిని ఎక్కువగా స్త్రీలలో చూస్తూ ఉంటాం.

ఈ నొప్పి సాధారణంగా తలకు ఒక పక్క మాత్రమే వస్తుంది. ఈ నొప్పి రావటానికి ప్రధాన కారణాలు మానసిక ఆందోళన,నిద్రలేమి,డిప్రెషన్ వంటి అనేక కారణాలతో మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అయితే మైగ్రేన్ తలనొప్పి ఏ కారణంతో వచ్చిందో తెలుసుకొని చికిత్స చేయించుకోవాలి.చికిత్సతో పాటు ఈ జాగ్రత్తలు కూడా తప్పనిసరి. వాటి గురించి తెలుసుకుందాం.

సరైన ఆహారం,నిద్ర లేకపోవటం వలన అలసట ఎక్కువ అయ్యి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. ఇలాంటి వారు వేడినీటి స్నానము చేసి లెమన్ టీ త్రాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మైగ్రేన్ తలనొప్పి పెరుగుతుంది . అందువల్ల ఎండలో బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గొడుగు వెంట తీసుకువెళ్లాలి.

కెఫీన్ ఎక్కువగా తీసుకున్న మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. అందువల్ల కెఫీన్ మోతాదు పెరిగిన తగ్గినా కూడా వస్తుంది. అందువల్ల ప్రతి రోజు సరైన మోతాదులోనే కెఫీన్ తీసుకోవాలి. కెఫీన్ అనేది మనం త్రాగే కాఫీ,టీ లలో ఉంటుంది.

బాగా ఎక్కువగా సౌండ్ పెట్టుకొని సంగీతాన్ని వినకూడదు. తక్కువ సౌండ్ లో మాత్రమే పెట్టుకొని వినాలి. ఎక్కువ సౌండ్ కారణంగా మైగ్రేన్ తలనొప్పి పెరిగే అవకాశం ఉంది.

రోజుకి 9 గంటలకు పైగా నిద్ర పొతే మైగ్రేన్ తలనొప్పి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రతి రోజు నిద్ర సమయాన్ని, నిద్ర పోయే గంటలు 8 గంటలు ఉండేలా చూసుకోవాలి.

మైగ్రేన్ తలనొప్పికి మందులు వాడటం వలన ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అందువల్ల ఈ జాగ్రత్తలను పాటిస్తే ఇంకా ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. మైగ్రేన్ తలనొప్పికి మందులు ఇంగ్లిష్,హోమియో పతి, ఆయుర్వేదంలో ఉన్నాయి. ఈ మందులు వాడిన తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. అందువల్ల మందులు వాడుతూ ఈ జాగ్రత్తలను పాటిస్తే మైగ్రేన్ తలనొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

జాగ్రత్తలు
అతిగా ఆలోచనలు చేయకూడదు

మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.

నూనెతో తలకు మసాజ్‌ చేసుకోవాలి. దీనివల్ల తలలోని నరాలు రిలాక్స్‌ అవుతాయి.

మైగ్రేన్‌ వచ్చినప్పుడు, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండే వాతావరణంలో పడుకోవాలి.
Click Here To Follow Chaipakodi On Google News