Udupi Hotel Style Kurma:వెజ్ కుర్మాని ఒక్కసారి ఇలా చేయండి.. చూస్తేనే నోట్లో నీళ్లూరతాయి..!
Udupi Hotel Style Kurma: చపాతి ,పూరి,దోశలోకి, ఎప్పటిలాగే చెట్నీస్, రొటీన్ కర్రీస్ కాకుండా, ఉడిపి స్టైల్లో వెజ్ కుర్మా తయారు చేసుకోండి. అచ్చం హోటల్లో తిన్నట్లుగా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు
నూనె – 3 టేబుల్ స్పూన్స్
యాలకులు – 4
లవంగాలు -4
దాల్చిన చెక్క – 1 ఇంచ్
మిరియాలు – 1 టీ స్పూన్
పెసలు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి -4
తురిమిన కొబ్బరి -1 కప్పు
తరిగిన ఉల్లిపాయలు – 1/2కప్పు
క్యారేట్ ముక్కలు – 1/2కప్పు
పచ్చి బటానీలు -1/2కప్పు
బంగాళదుంపలు ముక్కలు – 1/2కప్పు
పసుపు – ½ టీ స్పూన్
బెల్లం – 1 స్పూన్
కొత్తిమీర- 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా మసాలా కోసం, స్టవ్ పై పాన్ పెట్టుకుని, అందులోకి ఆయిల్ వేసుకోవాలి.
2. ఆయిల్ వేడెక్కిన, యాలకులు, లవంగాలు, మిరియాలు, ఎండుమిర్చి, పప్పులను వేసుకుని, బాగా వేయించుకోవాలి.
3.ఇప్పుడు వేయించుకున్న మసాలాను ఒక మిక్సీ జార్ లోకి తీసుకుని, అందులోకి ఎండుకొబ్బరి జత చేసి, గ్రైండ్ చేసుకోవాలి.
4. ఇప్పుడు అదే పాన్ లోకి మరింత ఆయిల్ వేసుకుని, వేడెక్కిన తర్వాత, తరిగిన ఉల్లిపాయలు ,క్యారెట్లు, బటానీలు, పొట్టుతీసిన బంగాళదుంప ముక్కులు, వేసి వేయించుకోవాలి.
5.కూరగాయల ముక్కలన్ని, ఉడికేంతవరకు, తగినన్ని నీళ్లు పోసి, ఉడికించుకోవాలి,
6. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాల పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి మరిగించుకోవాలి.
7. మరుగుతున్న సమయంలో బెల్లం, తిరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
8. అంతే టేస్టీ చేస్టీ వెజ్ కుర్మా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News