Beauty Tips

Face Glow Tips:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది

Rose water Face Glow Tips: చర్మ సంరక్షణలో ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా ముఖం అందంగా ఉండాలని మనలో చాలా మంది బ్యూటీ పార్లర్ కి వెళ్ళుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటిలోనే ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ గందం పొడి, ఒక స్పూన్ alovera జెల్, రెండు స్పూన్ల రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి,మెడకు రాసి 5 నిమిషాలు అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

గంధం ముఖ చర్మాన్ని చల్లబరుస్తుంది. ముఖ రంధ్రాలు క్లియర్ అవుతాయి. చర్మం నుండి టానింగ్ తొలగించడానికి సహాయపడుతుంది. గందం పొడి మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ ఇంటిలో గందం చెక్క నుండి గందం తీసుకుంటే మంచిది.

రోజ్ వాటర్ నేచురల్ టోనర్ లా పనిచేస్తుంది. రోజ్ వాటర్ చర్మం యొక్క pH స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. చర్మ రంద్రాల నుండి మురికిని తొలగించటానికి సహాయపడుతుంది.

కలబంద జెల్ మార్కెట్ లో లభ్యం అవుతుంది. కానీ కలబంద మొక్క నుండి ఆకులను తీసుకోని.. దాని నుండి జెల్ తీయండి. కలబందలో ఉన్న లక్షణాలు చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి.

ఈ ప్యాక్ ముఖం మీద నలుపు,మచ్చలు లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ ని తప్పనిసరిగా ప్రయత్నించి glow skin ని పొందండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News