Beauty Tips

Korean Glass Skin : ఇంట్లో ఉండే వాటితోనే కొరియన్ గ్లాస్ స్కిన్ పొందండి.. చాలా సింపుల్..

Korean Glass Skin : ముఖ చర్మం అందంగా ఉంటే ఆ ఆత్మవిశ్వాసం వేరుగా ఉంటుంది. చర్మ సంరక్షణలో సహాయపడే ఉత్పత్తులు ఎన్నో మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

వాటి కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవచ్చు.

చర్మ సంరక్షణలో శనగపిండిని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేయటమే కాకుండా చర్మ రంద్రాలను శుభ్రం చేస్తుంది. ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండిని తీసుకోని దానిలో సరిపడా కీరా రసం వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.

ఇది ముఖం మీద ఫేస్ స్క్రబ్ లాగా పని చేసి చర్మ రంధ్రాలలో ఉన్న మురికిని శుభ్రం చేయడంలో సహాయపడి ముఖం మెరవటానికి సహాయపడుతుంది. రోజు విడిచి రోజు ఇలా చేస్తే మంచి పలితాన్ని పొందవచ్చు.

చర్మం మీద తాన్ తొలగించటానికి.. ఒక బౌల్ లో అరస్పూన్ శనగపిండి వేసి దానికి సరిపడా రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 5 నిమిషాలు అయ్యాక శుభ్రం చేసుకోవాలి.

రోజ్ వాటర్ ముఖ చర్మం యొక్క pH స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ ప్యాక్ చర్మమ మీద తాన్ ని తొలగించటానికి చాలా అద్భుతం పనిచేస్తుంది. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తే సరిపోతుంది.

ఇది కూడా చూడండి:Rope With Clips:తాడుకే క్లిప్స్…వెరైటీగా ఉంది కదా.. అయితే కోనేయండి

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News