Kitchenvantalu

Kitchen Tips:చలికాలంలో ఆకు కూరలను ఇలా నిల్వ చేస్తే చాలా రోజులు తాజాగా ఉంటాయి..

Kitchen Tips:ఆకుకూరల్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ పోషకాలు అన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఆకు కూరలను ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని నిల్వ చేయటం కాస్త కష్టం అవుతుంది.

ఎక్కువగా కొన్నప్పుడు తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి. మనలో చాలామంది ఆకుకూరలను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు అలా కాకుండా పేపర్లో ఆకుకూరలను చుట్టి ఫ్రిజ్లో పెడితే ఆకుకూరల్లో తేమ తగ్గి తాజాగా ఉంటాయి.

కొత్తిమీర పుదీనా వంటి ఆకుకూరలు కాడలను కట్ చేసి గాలి చొరబడని డబ్బాలో ఉంచి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆకుకూరలను ఫ్రిజ్లో పెట్టినప్పుడు కొన్ని పండ్లు దగ్గరగా లేకుండా చూసుకోవాలి.

ఎందుకంటే ఇథిలీన్ విడుదలచేసే ఆపిల్ కర్బూజ ఆప్రికాట్ వంటి పండ్లను దూరంగా ఉంచాలి లేదంటే ఆకుకూరలు పాడైపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.