White Hair: తెల్ల జుట్టు భయపెడుతోందా? ఈ సింపుల్ చిట్కా పాటిస్తే నల్లని జుట్టు మీ సొంతం
White Hair Home Remedies:జుట్టుకి సంబందించిన సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, జుట్టు కుదుళ్లు బలంగా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టుకు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి ఒక మంచి నూనెను తయారు చేసుకుందాం. ఈ నూనె రాయటం వల్ల జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ బాగా సాగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.
ఒక గిన్నెలో ఐదు ఉసిరికాయలను తురుముకుని వేసుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు గోరింటాకు., గుప్పెడు కట్ చేసిన మందార ఆకులు, 100 గ్రాముల మెంతులు, రెండు స్పూన్ల kalonji seeds, గుప్పెడు గుంటగలగరాకు, గుప్పెడు కరివేపాకు వేసి దానిలో అరకేజీ కొబ్బరి నూనె వేయాలి.
ఇప్పుడు పొయ్యిమీద పెట్టి తక్కువ మంటలో పదార్థాలన్నీ కలుపుతూ నల్లగా మారే అంతవరకు నూనెను మరిగించుకోవాలి. ఈ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఈ నూనెను ప్రతి రోజూ తలకు రాసుకుంటూ రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.
అలాగే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. తల మీద చర్మం ఇన్ఫెక్షన్ కు గురికాకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు ఆరోగ్యంగా పొడవుగా పెరుగుతుంది. ఈ నూనె దాదాపుగా రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నూనె చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News