Semiya Pulihora Recipe: సేమియా పులిహోర.. ఎప్పుడైనా సరే రుచిగా తినాలనిపిస్తే కేవలం 10 నిమిషాల్లో ఇలా చేయండి
Semiya pulihora: టిఫిన్స్ అనగానే, ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, ఇవే చేసేస్తుంటాం. సేమియాతో పాయసం, ఉప్మానే కాదు, పులిహోర కూడా, చాలా బాగుంటుంది.
కావాల్సిన పదార్ధాలు
సేమియా – 1 కప్పు
నీళ్లు – 2 కప్పులు
పసుపు – 1/2టేబుల్ స్పూన్
ఉప్పు – కొద్దిగా
నీళ్లు – 1కప్పు
తాళింపు కోసం..
నూనె – 2.5టేబుల్ స్పూన్స్
ఆవాలు – 1 టేబుల్ స్పూన్
మినపప్పు – 1 టేబుల్ స్పూన్
శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు – 10
కరివేపాకు – 1 రెమ్మ
ఇంగువ – కొద్దిగా
పచ్చిమిర్చి – 1
ఎండుమిర్చి – 1
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.నీళ్లలో ఉప్పు, పసుపు వేసి, ఎసరును మరగనివ్వాలి.
2.మరుగుతున్న ఎసరులో సేమియా వేసి, 80 శాతం ఉడికించుకోవాలి.
3.80 శాతం ఉడికిన సేమియాను, వడకట్టి, చల్లని నీళ్లు పోసి, జల్లెడలో పూర్తిగా చల్లార నివ్వాలి.
4.ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, తాళింపు పదార్ధాలను వేసుకుని, ఎర్రగా వేపుకోవాలి.
5. తాళింపు వేగిన తర్వాత చల్లారిన సేమియా, కొద్దిగా కొత్తిమీర, ఉప్పు, వేసి, అట్లకాడతో, ఎగరేస్తూ, టాస్ చేసుకోవాలి.
6. టాస్ చేసిన తర్వాత , స్టవ్ ఆఫ్ చేసి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి.
7. అంతే సేమియా పులిహోర రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News