Chiranjeevi – K Raghavendra Rao:చిరంజీవి,రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమాలు
Chiranjeevi – K Raghavendra Rao: చిరంజీవి,రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు దాదాపుగా మంచి టాక్ తెచ్చుకున్నాయి. చిరంజీవి కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. స్వశక్తితో ఎదిగిన చిరంజీవి తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవటంలో సక్సెస్ అయ్యాడు.
చిరంజీవి,రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఎన్నో ప్రయోగాత్మ సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించిన సినిమాల్లో చిరంజీవి విలన్,హీరోగా చేసారు. అంతేకాక ద్విపాత్రాభినయం,త్రిపాత్రాభినయం కూడా చేసి మెప్పించాడు చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి కెరీర్ లో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో చేసిన సినిమాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఆ వివరాల్లోకి వెళ్ళితే….
1981 వ సంవత్సరంలో వచ్చిన ‘తిరుగులేని మనిషి’ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించాడు చిరంజీవి. ఈ సినిమాలో విలన్ గా నటించాడు.
1985 వ సంవత్సరంలో వచ్చిన ‘అడవి దొంగ’ సినిమాలో చిరంజీవి టార్జాన్ గా నటించి మెప్పించాడు.
1986 వ సంవత్సరంలో వచ్చిన ‘కొండవీటి రాజా’ సినిమాలో చిరంజీవి రాధ, విజయశాంతి లతో రొమాన్స్ చేసాడు.
1986 వ సంవత్సరంలో వచ్చిన ‘చాణక్య శపధం’ సినిమాలో విజయశాంతితో రొమాన్స్ చేసాడు.
1988 వ సంవత్సరంలో వచ్చిన ‘యుద్ధ భూమి’ సినిమాలో విజయశాంతితో జోడిగా నటించాడు.
1988 వ సంవత్సరంలో వచ్చిన ‘మంచి దొంగ’ సినిమాలో విజయశాంతి,సుహాసినిలతో రొమాన్స్ చేసాడు.
1989 వ సంవత్సరంలో వచ్చిన ‘రుద్ర నేత్ర’ సినిమాలో రాధ,విజయశాంతిలతో జోడి కట్టాడు.
1990 వ సంవత్సరంలో వచ్చిన ‘జగదేగ వీరుడు అతిలోక సుందరి’ సినిమాలో శ్రీదేవితో కలిసి నటించాడు.
1991 వ సంవత్సరంలో వచ్చిన ‘రౌడీ అల్లుడు’ సినిమలో చిరంజీవి దివ్యభారతితో కలిసి నటించాడు.
1992 వ సంవత్సరం వచ్చిన ‘ఘరానా మొగుడు’ సినిమలో నగ్మా,వాణి విశ్వనాథ్ తో జోడి కట్టాడు.
1994 వ సంవత్సరంలో వచ్చిన ‘ముగ్గురు మొనగ్గాళ్లు’ సినిమాలో త్రిపాత్రాభినయం చేసి మెప్పించాడు.
1999 వ సంవత్సరంలో వచ్చిన ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో రమ్యకృష్ణ తో కలిసి నటించాడు.
చిరంజీవి,రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమాలు
Click Here To Follow Chaipakodi On Google News