Beauty Tips

Hair Fall:దువ్విన ప్రతి సారి జుట్టు విపరీతంగా రాలిపోతుండా.. ఈ చిట్కాలు మీకోసమే..!

Protein hair serum at home: జుట్టును సహజసిద్దంగా పొడవుగా, ఒత్తుగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ హెయిర్ సీరమ్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. జుట్టు పల్చబడటం లేదా జుట్టు రాలడం అనే సమస్య ఈ మధ్య కాలంలో ఎక్కువ అయింది.

జుట్టుకు సరైన పోషణ లభించనప్పుడు జుట్టు రాలటం ప్రారంభం అయ్యి చాలా తక్కువ సమయంలోనే జుట్టు పలుచగా మారిపోతుంది. ఇటువంటి సమయంలో జుట్టు పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలి.

ప్రొటీన్ హెయిర్ సీరమ్ జుట్టును ఒత్తుగా మార్చటమే కాకుండా.. జుట్టును సిల్కీగా మరియు మెరిసేలా చేస్తుంది. ప్రొటీన్ హెయిర్ సీరమ్ కోసం వేల కొద్ది డబ్భును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులోనే ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు.

ముందుగా ఒక గిన్నెలో గుడ్డు, ఆలివ్ ఆయిల్ మరియు తేనె కలపాలి. జుట్టును తడిపి తయారుచేసుకున్న సీరమ్‌ను జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత జుట్టును శుభ్రం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి పలితం కనిపిస్తుంది.

జుట్టు పొడిగా ఉన్నవారు, పెరుగు మరియు తేనెతో చేసిన సీరమ్ ని ఉపయోగిస్తే.. జుట్టును హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. ఒక బౌల్ లో అరకప్పు పెరుగు తీసుకోని దానిలో రెండు స్పూన్ల తేనే వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.

ఇది కూడా చూడండి:ఇత్తడి కుక్కర్లు వస్తున్నాయి.. మీరు వాడారా.. ?

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.
Click Here To Follow Chaipakodi On Google News