Healthhealth tips in telugu

Health Care:వేడి ఆహారం, వేడి నీళ్లలో నిమ్మరసం పిండుతున్నారా.. వెంటనే ఈ అలవాటు మానేయండి!

Health Care: మనలో కొంత మంది నిమ్మకాయను ఎక్కువగా వాడతారు. పుల్లని రుచి కలిగిన నిమ్మకాయలో ప్రొటీన్, కొవ్వు, విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసం తీసుకుంటే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు.

వేడి ఆహారంలో నిమ్మరసం కలపటం వలన నిమ్మకాయలోని పోషకాలన్నీ నశిస్తాయి. ఇది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కి కూడా కారణమవుతుంది. కాబట్టి వేడి నీటిలో లేదా ఆహారంలో నిమ్మకాయను పిండకండి. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్దిగా ఉంటుంది. మనలో చాలా మంది స్టార్టర్స్ మరియు సలాడ్ మీద నిమ్మరసం పిండుతూ ఉంటారు.

ఇలా చేయడం వల్ల ఆహారానికి మరింత రుచి వస్తుంది. కొంతమంది తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వటానికి భోజనం అయ్యాక నిమ్మరసం తాగుతూ ఉంటారు. నిమ్మరసంలో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటానికి మరియు బరువు తగ్గటానికి సహాయపడతాయి. అయితే వేడి ఆహారం, వేడి నీళ్లలో నిమ్మరసం కలిపితే కొన్ని హానికరమైన ప్రభావాలు మన ఆరోగ్యం మీద పడతాయి.

నిమ్మరసం ఆహారంలో కలపటం వలన మంచి రుచి వస్తుంది. అయితే వేడి ఆహారం మీద పిండినప్పుడు విటమిన్ సి వంటి పోషకాలు తగ్గుతాయి. విటమిన్ సి యొక్క పోషకాలు వేడికి గురికావడం వల్ల బలహీనపడతాయి. విటమిన్ సిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉండుట వలన అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు వేగంగా క్షీణిస్తుంది.

అలాగే దాని ప్రభావాన్ని తగ్గిస్తుంది. దీంతో నిమ్మకాయలోని పోషకాలన్నీ వృథా అవుతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో మాత్రమే నిమ్మరసం కలపాలి. అదే విధంగా ఫుడ్ ఐటెమ్స్ కూడా చేసినప్పుడు అవి గోరువెచ్చగా, చల్లగా అయ్యాక మాత్రమే నిమ్మరసం కలపాలి. అప్పుడే విటమిన్ సి లాభాలను పొందవచ్చు.

మొక్కజొన్న పొత్తులు కూడా కాల్చినప్పుడు వేడిగా ఉన్నదానిపైనే నిమ్మరసం పిండి తింటూ ఉంటారు. అలా చేసినప్పుడు కేవలం రుచిని మాత్రమే ఆస్వాదిస్తారు. విటమిన్ సి లాభాలను పొందలేరు. ఇక సలాడ్స్, సూప్స్‌లో కూడా చల్లగా అయ్యే వరకూ కచ్చితంగా వెయిట్ చేయాలి. ఆ పదార్థాలు చల్లగా అయ్యేవరకూ వెయిట్ చేసి ఆ తర్వాత నిమ్మరసం వేసి తింటేనే ఆరోగ్య ప్రయోజనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News