Pimples:మొటిమలను శాశ్వతంగా దూరం చేసే నేచురల్ రెమెడీస్…!!
Pimples:ముఖం మీద మొటిమలు మరియు మొటిమల కారణంగా వచ్చే నల్లని మచ్చలను తొలగించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాస్త ఓపికగా చేస్తే చాలా తక్కువ ఖర్చులో తొలగించుకోవచ్చు.
ఒక్క మొటిమ చాలు మన సంతోషాన్ని ధ్వంసం చేయడానికి. నొప్పిగా ఉండటమే కాకుండా అంద విహీనతకు కారణమౌతుంది. కొంత శ్రమ, కాస్త శ్రద్ధ ఉంటే మొటిమలను నివారించుకోవడం ఏమంత కష్టం కాదు.కొన్ని నేచురల్ రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఎఫెక్టివ్ గా మొటిమలను నివారించుకోవచ్చు.
నిమ్మరసం, తేనె:
సమపాళ్లలో నిమ్మరసం, తేనె కలిపి మొటిమల మీద రాసి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఐదారుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
నువ్వులూ:
నువ్వులూ మొటిమలకు పరిష్కారం చూపుతాయి. వాటిని రాత్రంతా నీళ్లలో నానబెట్టి మర్నాడు ముద్దలా చేయాలి. దీన్ని మొటిమల మీద రాసి ఆరాక కడిగేసుకుంటే చాలు.
బంగాళదుంప రసం:
ముఖానికి బంగాళదుంప రసం రాసినా ఫలితం ఉంటుంది. ఇది మొటిమలని తగ్గించడమే కాక ముఖానికి సహజ మెరుపునిస్తుంది.
లవంగాలు :
మొటిమలు ఎక్కువగా ఉన్నప్పుడు లవంగాలను నీళ్లు, లేదా పాలతో కలిపి మెత్తగా చేయాలి. దీన్ని మొటిమల మీద రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేయాలి.
పుదీనా :
కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తని ముద్దలా చేయాలి. దీన్ని మొటిమలున్న చోట రాసి ఐదు నిమిషాల తర్వాత కడిగేస్తే మార్పు కనిపిస్తుంది. పుదీనాలో చర్మానికి చల్లదనాన్నిచ్చే గుణాలున్నాయి.
తులసి ఆకు:
తులసి ఆకుల ముద్దను మొటిమలపై రాయడం వల్ల అవి తగ్గుతాయి. బజార్లో తులసి ఆకుల పొడి దొరుకుతుంది. దానికి కాసిని వేడినీళ్లు కలిపి పూతలా చేసి మొటిమలపై రాసి, పది నిమిషాల తరవాత కడిగేయాలి.
వేప ఆకు:
వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
పసుపు:
కస్తూరి పసుపును నిమ్మరసంతో కలిపి ఆ మిశ్రమాన్ని రాస్తే మొటిమలు తగ్గుతాయి. చిటికెడు పసుపు ముఖానికి రాసి, కొద్దిసేపటి తర్వాత ముఖం కడుక్కోవడం ద్వారా మొటిమలను తగ్గించుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News