Beauty Tips

Hair Loss tips Telugu : జుట్టు రాలే సమస్యకు ఇంటి చిట్కాలు.. ఇలా చేస్తే అంతా సెట్!

Hair Fall Tips in Telugu :ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవాలంటే మంచి పోషకాహారం తీసుకుంటూ.. ఇప్పుడు చెప్పే ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు.

ఈ ప్యాక్ కి కావలసిన పదార్ధాలు,ఎలా తయారుచేయాలి. ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ ప్యాక్ కి అవసరం అయిన అన్నీ వస్తువులు ఇంటిలో అందుబాటులో ఉందేవే.

కావలసిన పదార్ధాలు
బాగా పండిన అరటిపండు – సగం
గుడ్డు పచ్చ సోన
తేనే – 1 స్పూన్

ఒక బౌల్ లో అరటిపండును మెత్తగా చేసి దానిలో గుడ్డు పచ్చ సొన,తేనే వేసి బాగా కలిసేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మీద చర్మం మీద రాసి మూడు గంటల పాటు ఆలా వదిలేసి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. కాస్త ఓపికగా చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో సమస్య నుండి బయట పడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News