Beauty Tips

Skin Care Tips:చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఎలా వాడుతున్నారు…

Skin Care Tips:చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఎలా వాడుతున్నారు… ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చడంలో ముల్తానీ మట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మృదువుగా మారటమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేస్తుంది. అయితే ఏ చర్మ సమస్య కు ఎలా వాడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కాంతివంతమైన చర్మం కోసం ప్యాక్ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఒక బౌల్ లో మూడు స్పూన్ల ముల్తానీ మట్టి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ కీర దోశ గుజ్జు 2 స్పూన్ల శనగపిండి ఒక స్పూన్ పాలు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది

బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గాలంటే 2 స్పూన్ల ముల్తానీ మట్టి ఒక స్పూన్ పెరుగు ఒక స్పూన్ నిమ్మరసం చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News