Devotional

Dhanteras 2024:ధనత్రయోదశి రోజు తప్పనిసరిగా కొనవలసిన వస్తువులు ఏమిటో తెలుసా?

Dhanteras 2023:హిందూ క్యాలెండర్ ప్రకారం..దీపావళి పండగకు ముందు వచ్చే త్రయోదశి రోజును ధనత్రయోదశి పండగను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 29న మంగళవారం ధనత్రయోదశిని జరుపుకోనున్నారు. ఆ రోజు ఆయుర్వేద దేవుడైన ధన్వంతరిని సంపద, శ్రేయస్సు కలిగించే దేవత అయిన లక్ష్మీదేవిని ప్రజలు పూజిస్తుంటారు

ఇక ఈ రోజున కింద చెప్పిన వస్తువులను కొనండి. దీంతో మీరు అనుకున్నది నెరవేరుతుంది. లక్‌ కలసి వస్తుంది. ధనం, ఆరోగ్యం లభిస్తాయి. మరి ధంతేరస్‌ రోజున కొనాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. వెండి, ఇత్తడి
ధంతేరస్‌ రోజున వెండి లేదా ఇత్తడితో చేసిన వస్తువులను కొనండి. అనంతరం వాటిని మీ ఇంట్లో తూర్పు దిక్కున ఉంచండి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

2. చీపురు
ధంతేరస్‌ రోజున చీపురును కొని తెచ్చుకోండి. దీంతో మీ ఆర్థిక సమస్యలు పోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి.

3. ఎలక్ట్రానిక్‌ వస్తువులు
ఫ్రిజ్‌, టీవీ, ఏసీ, ఫోన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను కొనండి. వీటిని వాయువ్య దిశలో పెట్టండి. శుభం జరుగుతుంది.

4. వ్యాపారులు
వ్యాపారం చేసే వారు ఓ రిజస్టర్‌ బుక్‌ను కొని దాన్ని తమ కార్యాలయంలో పశ్చిమ దిశలో పెట్టాలి. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.

5. వృత్తికి సంబంధించినది
ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా ధంతేరస్‌ రోజున తమ వృత్తికి చెందిన ఏదో ఒక వస్తువును కొనండి. దీంతో అందులో మీరు రాణిస్తారు

6. గోమతి చక్ర
గోమతి చక్ర అని పిలవబడే గవ్వలు మనకు దొరుకుతాయి. వాటిని ధంతేరస్‌ రోజున కొని పసుపు రంగు వస్త్రంలో చుట్టి లాకర్‌లో పెట్టాలి. దీంతో అనుకున్నది నెరవేరుతుంది.

7. బంగారు కాయిన్‌ లేదా లక్ష్మీ ఫొటో
ధంతేరస్‌ రోజున బంగారు కాయిన్‌ లేదా, లక్ష్మీ దేవి, వినాయకుడు ఉన్న ఫొటోను కొని ఇంటికి తెచ్చుకోండి. దీంతో సకల శుభాలు కలుగుతాయి.

8. స్వస్తిక్‌
ఇంటి గుమ్మం లేదా గేటు ఎదుట స్వస్తిక్‌ గుర్తు ఉన్న ఓ బోర్డును ధంతేరస్‌ రోజున ఏర్పాటు చేయండి. లక్‌ కలసి వస్తుంది.

9. సమయం
ధంతేరస్‌ రోజున బంగారం కొనేవారు ఉదయం సూర్యోదయం జరిగిన తరువాత నుంచి సాయంత్రం సూర్యాస్తమయం జరిగే మధ్యలో ఎప్పుడైనా బంగారం కొనండి. అదృష్టం కలసి వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News