Kitchenvantalu

Mosquitoes:ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా? నిమ్మకాయతో ఈ చిన్న చిట్కా పాటించండి..

Mosquitoes Home Remedies: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా? నిమ్మకాయతో ఈ చిన్న చిట్కా పాటించండి.. ఇంట్లోనే సహజసిద్ధమైన ఉత్పత్తుల సహాయంతో దోమలను తరిమికొట్టవచ్చని మీకు తెలుసా? అవును, మనల్ని కుట్టే దోమలను తరిమికొట్టడానికి మనం ఉపయోగించే రోజువారీ గృహోపకరణాలను కూడా ఉపయోగించవచ్చు.

వానాకాలం మొదలు అయింది. ఈ సీజన్ లో వానలతో పాటు దోమలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దోమలను తరిమి కొట్టటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేసి విసిగి పోతాము. మార్కెట్ లో దొరికే ఎన్నో ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాం. అయినా పెద్దగా పలితం ఉండదు.

అలా కాకుండా మన ఇంటిలో దొరికే కొన్ని పదార్ధాలతో చాలా సులభంగా దోమలను తరిమి కొట్టవచ్చు. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. ఈ చిట్కాలను ఫాలో అయితే ఈ వానాకాలంలో దోమలు లేకుండా హాయిగా ఉండవచ్చు. దోమల కారణంగా ఎన్నో వ్యాధులు వస్తున్నాయి. వాటిని కూడా అరికట్టవచ్చు.

నిమ్మకాయ,లవంగాలు దోమల నివారణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మకాయను సగానికి కట్ చేసి పది లవంగాలను గుచ్చి గదిలో లేదా హాల్ లో పెట్టాలి. ఆ వాసనకు దోమలు పారిపోతాయి. ప్రతి రోజు నిమ్మకాయ,లవంగాలను మార్చుతూ ఉండాలి.

వెల్లుల్లి కూడా దోమలను తరిమి కొడుతుంది. వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి నీటిని పోసి మెత్తని పేస్ట్ గా చేసి నీటిలో కలిపి దోమలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే దోమలు పారిపోతాయి. వెల్లుల్లిలో ఉండే సల్పర్ దోమలనే కాకుండా ఈగలు మరియు కీటకాలు ఏమి రాకుండా చేస్తుంది.

కర్పూరం కూడా దోమలను,ఈగలను తరిమి కొడుతుంది. ఒక గిన్నెలో నీటిని పోసి కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి గది లేదా హాల్ లో పెడితే దోమలు ఆ వాసనకు బయటకు పోవటమే కాకుండా…బయట దోమలు కూడా లోపాలు రావు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.