Health

Grapes:ద్రాక్ష ప్రతి రోజూ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే..

Grapes:ద్రాక్ష ప్రతి రోజూ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే..ద్రాక్షలో సి-విటమిన్‌, విటమిన్‌-ఏ, బీ6, ఫోలిక్‌ ఆమ్లం సమృద్ధిగా ఉంటాయి. పొటాషియం, కాల్షియం, ఇనుము, ఫాస్పరస్‌, మెగ్నీషియం, సెలీనియంలాంటి ఎన్నోరకాల ఖనిజలవణాలు ద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. ద్రాక్షలో ఉండే ప్లేవనాయిడ్స్‌ లాంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు రాకుండా యవ్వనంగా ఉండేలా చేస్తాయి. అలాగే ద్రాక్ష రక్తంలో నైట్రిన్‌ ఆక్సైడ్‌ మోతాదును పెంచుతుంది. నైట్రిక్‌ ఆక్సైడ్‌ రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు తింటే బిపి కంట్రోల్ లో ఉంటుంది.

చదువుకొనే పిల్లలకు తరచుగా ద్రాక్ష పళ్ళను తినిపిస్తే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ద్రాక్షలో ఉండే ఫైటో కెమికల్స్‌ రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని బయటకు పంపటంలో సహాయపడతాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ద్రాక్ష గొప్ప ఔషధం అని చెప్పవచ్చు. ద్రాక్షను రెగ్యులర్ గా ఆహారంలో భాగంగా చేసుకుంటే వ్యర్ధాలను బయటకు పంపి కొవ్వు శరీరంలో చేరకుండా చేస్తుంది.

మధుమేహం ఉన్నవారు ద్రాక్ష తినకూడదని చెప్పుతారు. కానీ ద్రాక్షలో రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించే శక్తి ఉంది. నల్లద్రాక్షలోప్రత్యేకంగా ఉండే పాలీఫెనాల్‌ మైగ్రెయిన్‌ తలనొప్పినీ, మతిమరుపును అదుపులో ఉంచి.. మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. ద్రాక్షలో పాలీఫినోల్స్‌గా పిలిచే యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన శరీరంలోని కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దాంతో అధిక బరువు సమస్యతో బాధపడేవారు బరువు తగ్గుతారు. జీవక్రియలు సాఫీగా జరిగేలా చేస్తుంది.

ఫ్యాట్‌ కంటెంట్‌ అధికంగా ఉన్న ఆహారం తీసుకున్న రోజు అరకప్పు ద్రాక్షలు తీసుకుంటే ఫాట్‌ను బర్న్ చేయడంతో పాటు కొలెస్టరాల్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. తద్వారా అనవసరపు ఫాట్ తగ్గుతుంది. శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది.ద్రాక్షలో ఉన్న లక్షణాలు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యంలోను కీలకమైన పాత్రను పోషిస్తాయి. ద్రాక్షను తినటం వలన శరీరంలో కొల్లాజిన్‌ ఉత్పత్తిని పెంచి చర్మం మెరిసేలా చేస్తుంది. అంతేకాక శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపి చర్మానికి నిగారింపును తెస్తాయి. దాంతో వృద్దాప్య ఛాయలు కనపడవు. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.chaipakodi.com/