Cleaning in Rainy Season:వర్షం వల్ల ఇంట్లో తేమ పెరిగిపోయిందా? డోంట్ వర్రీ – ఈ టిప్స్ పాటిస్తే..
Cleaning in Rainy Season:వర్షం వల్ల ఇంట్లో తేమ పెరిగిపోయిందా? డోంట్ వర్రీ – ఈ టిప్స్ పాటిస్తే.. సాధారణంగానే వర్షాకాలంలో ఇంటా బయటా తేమ అధికంగా ఉంటుంది. ఇక చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అవేమి లేకుండా కేవలం ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అంటున్నారు నిపుణులు.
వర్షాకాలంలో ఇంటిని మరియు ఇంటి పరిసరాలను చాలా శుభ్రం ఉంచుకోవాలి. ఒక్కోసారి ఎంత శుభ్రం చేసిన వర్షం కారణంగా ఇంటి గోడలపై తేమ వచ్చి ఫంగస్ ఏర్పడుతుంది. ఈ ఫంగస్ ని శుభ్రం చేసుకోకపోతే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి గోడలు,పర్నిచర్ అంచులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.
గోడలు పొడిగా ఉండేలా చూసుకోవాలి.పెయింట్ చేయించే ముందు వాటర్ ప్రూఫింగ్ కోట్ వేయించుకోవాలి. ఇది వర్షాకాలం ముందే చేయించి జాగ్రత్త పడాలి. వార్డ్‌రోబ్‌లు , క్యాబినెట్‌ల తలుపులు గాలి లోపలికి వచ్చేలా తెరిచి ఉంచాలి. తేమ,ఫంగస్ కారణంగా అతిసారం, గియార్డియాసిస్, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరం, ఇ.కోలి ఇన్ఫెక్షన్ మరియు సాల్మొనెలోసిస్ వంటి సమస్యలు వస్తాయి.
నీటిలో బ్లీచ్ కలిపి ఫంగస్, తేమ ఉన్న ప్రదేశంలో శుభ్రం చేయాలి. ఇలా చేయటం వలన బ్లీచ్ లో ఉన్న లక్షణాలు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. శుభ్రపరిచేటప్పుడు చేతి తొడుగులు తప్పనిసరిగా ధరించాలి. క్రిమిసంహారక, క్లోరిన్ బ్లీచ్ ఉపయోగిస్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్క్, కళ్ళజోడు,చేతి తొడుగులు వంటి వాటిని తప్పనిసరిగా ధరించాలి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u