Dandruff:వారంలో 2 సార్లు చుండ్రు,పేల సమస్య తొలగిపోయి జీవితంలో అసలు ఉండవు
Dandruff:వారంలో 2 సార్లు చుండ్రు,పేల సమస్య తొలగిపోయి జీవితంలో అసలు ఉండవు.. చుండ్రు సమస్య,పేల సమస్య ఉన్నాయంటే విపరీతమైన దురద వచ్చేస్తుంది. అలాగే విపరీతమైన చిరాకు కూడా వస్తుంది. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా పెద్దగా ప్రయోజనం కనపడక ఎంతో నిరాశ చెందుతారు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడిన అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.
ఇంటి చిట్కాలు ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది. కాస్త ఓపిక,శ్రద్ద పెడితే చాలా మంచి ఫలితాలను చాలా తొందరగా పొందవచ్చు. చుండ్రు సమస్య నుండి బయట పడటానికి అల్లం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెండు అంగుళాల అల్లం ముక్కను శుభ్రంగా కడిగి తొక్క తీసి తురిమి రసం తీయాలి.
మూడు స్పూన్ల అల్లం రసంలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి రెగ్యులర్ గా వాడే షాంపూ మూడు స్పూన్లు వేసి బాగా కలిపి తలస్నానం చేయాలి. జుట్టును బట్టి షాంపూను వేసుకోవాలి. పొడుగు జుట్టు ఉన్నవారికి ఎక్కువ షాంపూ అవసరం అవుతుంది. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా పేల సమస్య,చుండ్రు సమస్య రెండు తొలగిపోతాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ చుండ్రు మరియు పేల సమస్యను తొలగించటానికి సహాయపడుతుంది. చుండ్రు,పేల సమస్య ఈ రెండు సమస్యలు ఉన్నప్పుడూ జుట్టు విపరీతంగా రాలుతుంది. ఈ చిట్కా ఫాలో అయితే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా మృదువుగా పెరుగుతుంది. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అయ్యి చుండ్రు సమస్య,పేల సమస్య నుండి బయట పడండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u