Kitchenvantalu

Instant Semiya Uthappam:సేమియా ఊతప్పం.. చిటికెలో రెడీ.. ఇలా చేస్తే క్రిస్పీగా టేస్టీగా వస్తాయ్..

Instant Semiya Uthappam:దోశతో బోర్ కొట్టిందా. ఈ సారి దోశలు వెరైటీగా చేసుకుందాం. సేమియాతో సేమియా ఊతప్పం చేసుకుంటే చాలా రుచిగా వుంటాయ్. మిగిలిపోయిన ఇడ్లీ పిండితో, లేదా రవ్వతో, ఊతప్పం చేసుకుంటూనే ఉంటాం. కాని సేమియాతో ఊతప్పం ఎలా చేయాలో చూసేద్దాం.ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు.

కావాల్సిన పదార్ధాలు
పెరుగు – 1కప్పు
రవ్వ – 1కప్పు
సేమియా – 1కప్పు
వంట సోడా – 1/2కప్పు
అల్లం – ½ ఇంచ్
పచ్చిమిర్చి – 3
నూనె – కాల్చుకోవడానికి
ఉప్పు – తగినంత
నీళ్లు – 1 1/4కప్పు

తాళింపు కోసం..
నూనె – 1/2టేబుల్ స్పూన్
ఉల్లిపాయ – 1/3కప్పు
జీలకర్ర – టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు

తయారీ విధానం
1.పెరుగులో వంట సోడా కలిపి, అరగంట పాటు వదిలేస్తే, పెరుగు పొంగుతుంది.
2.అల్లం పచ్చిమిర్చిని, మెత్తగా దంచుకుని, పక్కన పెట్టుకోండి.
3.పొంగిన పెరుగులో,రవ్వ, సేమియా, ఉప్పు, నీళ్లు, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి, బాగా కలిపి, అరగంట పాటు నా నపెట్టాలి.
4.ఇప్పుడు స్టవ్ పాన్ పెట్టుకుని, నూనె వేడి చేసి, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, వేసి, వేగిన తాళింపును, పొంగిన పిండిలో కలిపేసుకోవాలి.

5.ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని, నూనె వేసి పెనం వేడెక్కనివ్వాలి.
6.ఇప్పుడు గరిటెడు పిండిని, పెనం పై వేసి, కొద్దిగా స్ప్రెడ్ చేయాలి.
7.పిండి అంచుల వెంట, నూనె వేసి, మీడియం ఫ్లేమ్ పై, ఎర్రగా కాల్చుకోవాలి.
8. అంతే సేమియా ఊతప్పం రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News