Healthhealth tips in telugu

Weight Loss:బరువు తగ్గించటానికి తేనే మరియు దాల్చిన చెక్క వాడుతున్నారా ?

Weight Loss Drink:మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుండి బయట పడాలంటే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. ముఖ్యంగా అధిక బరువు సమస్య నుండి బయట పడటానికి దాల్చిన చెక్క,తేనే బాగా సహాయపడతాయి.

బరువును తగ్గించుకోవటానికి తేనే మరియు దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలి ఇప్పటివరకు మనం తేనే,దాల్చిన చెక్కలో ఉన్న అనేక ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం. కాబట్టి ఈ రెండు పదార్దాలను కలిపి ఉపయోగిస్తే మంచి ప్రభావవంతమైన పలితాలను పొందవచ్చు. ఇప్పుడు బరువును విజయవంతంగా తగ్గటానికి తేనే,దాల్చిన చెక్క నివారణలను తెలుసుకుందాం.

1. తేనె మరియు దాల్చిన చెక్క నీరు
ఇది సులభంగా మరియు విజయవంతంగా బరువు కోల్పోవటానికి సహాయపడే సమర్థవంతమైన ఇంటి నివారణిగా చెప్పవచ్చు. అయితే దీనిని ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

కావలసినవి
సేంద్రీయ తేనే – 1 స్పూన్
సేంద్రీయ దాల్చిన చెక్క పొడి – 1 స్పూన్
ఫిల్టర్ వాటర్ – 1 కప్పు

పద్దతి
1. ఒక బౌల్ లో దాల్చిన చెక్క పొడి తీసుకోవాలి.
2. నీటిని కాచి, ఆ నీటిని దాల్చిన చెక్క పొడిలో పోయాలి.
3. దాల్చిన చెక్క నీటిని 10 నుండి 15 నిమిషాల పాటు అలా ఉంచాలి.
4. ఇప్పుడు ఈ మిశ్రమంలో తేనే వేసి బాగా కలపాలి.
5. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో ఒకసారి, రాత్రి పడుకొనే ముందు ఒకసారి
త్రాగితే బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది.

గమనిక
వేడిగా ఉన్న ద్రవంలో తేనేను వేస్తె ఎంజైములు నాశనం అవుతాయి. కాబట్టి ద్రవం చల్లారిన తర్వాత మాత్రమే తేనెను కలపాలి.

2. తేనే మరియు దాల్చిన చెక్క టీ
దీనిని ఇంటిలో సులభంగా తయారుచేసుకోవచ్చు. అలాగే బరువు నష్టం ప్రక్రియను వేగవంతం చేయటానికి ఇది మరొక సులభమైన మరియు సమర్థవంతమైన పరిష్కారం అని చెప్పవచ్చు.

కావలసినవి
పొడవాటి దాల్చిన చెక్క – 1
తేనె – 1 స్పూన్
నీరు – 1 ½ కప్పు

పద్దతి
1. పొడవాటి దాల్చిన చెక్కను చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.
2. ఒక సాస్ పాన్ లో నీటిని పోసి మరిగించాలి.
3. ఈ మరిగించిన నీటిలో దాల్చిన చెక్క ముక్కలను వేయాలి.
4. ఆ తర్వాత సాస్ పాన్ మీద మూత పెట్టి 10 నిముషాలు అలా ఉంచాలి.
5. దాల్చిన చెక్క నీటిని ఒక గ్లాస్ లోకి వడకట్టి, దానిలో తేనే కలపాలి.
6. బాగా కలిపాక ఈ టీని త్రాగాలి.
7. ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ టీని త్రాగితే క్రమంగా బరువు తగ్గుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u