Hair Care Tips:ఆముదంలో ఇది కలిపి రాస్తే ఎంత పల్చగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది
Hair Fall In Telugu : మనలో చాలా మంది జుట్టు పొడవుగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో చుండ్రు, జుట్టు రాలే సమస్య ఎక్కువ అయింది. దీనికి సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, పోషకాల కొరత, రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలను ఉపయోగించడం, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వలన జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. .
మనలో చాలా మంది జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే చాలా కంగారుపడి మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు. అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. .
కేవలం రెండే రెండు పదార్థాలను ఉపయోగించి జుట్టు రాలే సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటిలో కలబంద మొక్క ఉంటుంది. కలబంద ఒక మట్టను తీసుకొని శుభ్రంగా కడిగి లోపల ఉన్న జెల్ ని సపరేట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఒక కప్పు కలబంద జెల్, రెండు స్పూన్ల ఆముదం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంట తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య., చుండ్రు సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య ఉందంటే జుట్టు రాలే సమస్య కూడా చాలా ఎక్కువ అవుతుంది.
ఇలా సహజసిద్దమైన పదార్ధాల్తో చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు. కలబంద ఇంటిలో లేకపోతే మార్కెట్ లో దొరికే కలబంద జెల్ వాడవచ్చు. ఆముదంను జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u