Hair Fall Tips:నెలకు ఒకసారి ఈ పేస్ట్ జుట్టుకి పట్టిస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది
Mehandi Hair benefits In telugu : ఈ మధ్య కాలంలో జుట్టుకి సంబందించిన అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే జుట్టు రాలే సమస్య, తెల్లజుట్టు సమస్య, చుండ్రు వంటి అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి గోరింటాకు పొడి సహాయపడుతుంది. గోరింటాకు పొడిని హెన్నా లేదా మెహంది అని కూడా పిలుస్తారు. ఇది మార్కెట్ లో లభ్యం అవుతుంది.
అలాగే ఇంటిలో కూడా తయారుచేసుకోవచ్చు. గోరింటాకును నీడలో ఆరబెట్టి మెత్తని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడూ…ఒక బౌల్ లో 2 స్పూన్ల హెన్నా పొడి, అరచెక్క నిమ్మరసం,అరస్పూన్ ఆలివ్ ఆయిల్, సరిపడా నీటిని పోసి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని నూనె రాసిన జుట్టుకి పట్టించి 40 నిమిషాల తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
ఇలా చేయటం వలన పొడిగా ఉన్న జుట్టు తేమగా మారుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. జుట్టుకి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. నెలకు ఒకసారి ఈ విధంగా చేస్తే మంచి ఫలితం పొందవచ్చు. జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.
గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రు సమస్య ను తగ్గిస్తుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం. ఈ పొడి జుట్టుకి ఎటువంటి హాని కలిగించదు. జుట్టు నేచురల్ హెయిర్ గా ఉంచి, తగినంత పోషణ, ఆరోగ్యాన్ని అంధిస్తుంది. అంతేకాక తలలో నేచురల్ యాసిడ్ ఆల్కలైన్ ను సమతుల్యం చేస్తుంది.
జుట్టు ప్రకాశవంతంగా మెరుస్తుంది. జుట్టుకి సంబందించి ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కాకుండా ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో పరిష్కారం చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u