Besan For Face:శనగపిండితో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది
Besan For Face:శనగపిండితో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది..: ముఖం అందంగా, తెల్లగా కాంతివంతంగా మెరవాలని మనలో ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు, చర్మం జిడ్డుగా ఉండటం వంటి అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల పరిష్కారానికి శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది. శనగపిండిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం.
శనగపిండిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చర్మ ప్రయోజనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. శనగపిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. శనగపిండి చర్మం మీద జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది. అలాగే నల్లని మచ్చలు, వయస్సు పెరిగే కొద్ది వచ్చే ముడతలను తొలగించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, ఒక స్పూను నిమ్మరసం, సరిపడా నీటిని పోసి బాగా కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చర్మం మీద మృత కణాలు తొలగిపోయి చర్మం తెల్లగా మెరుస్తుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి పలితం చాలా తొందరగా వస్తుంది.
ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి, అర స్పూన్ పెరుగు,అరస్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ రోజు వాటర్, అర స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మొటిమలు మరియు వాటి కారణంగా వచ్చే మచ్చలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి, చిటికెడు పసుపు వేసి సరిపడా నీటిని పోసి బాగా కలపాలి. ఈ పేస్టు ని ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చర్మం మీద ఉన్న జిడ్డు అంతా తొలగిపోవడమే కాకుండా ముడతలు కూడా తొలగిపోయి చర్మం యవ్వనంగా కనపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.