Business

Reliance Jio : జియో కొత్తప్లాన్.. కేవలం 11 రూపాయిల రీఛార్జితో 10 GB హై స్పీడ్‌ డేటా..

Reliance Jio : జియో కొత్తప్లాన్.. కేవలం 11 రూపాయిల రీఛార్జితో 10 GB హై స్పీడ్‌ డేటా.. జియో సరికొత్త ప్లాన్ ని అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో.. సరికొత్త డేటా బూస్టర్ ప్లాన్ తీసుకొచ్చింది.

ఇప్పుడు కేవలం రూ. 11 రీఛార్జితోనే.. 10 జీబీ హై స్పీడ్ డేటాను వినియోగించుకునే సదుపాయం లాంఛ్ చేసింది. దీంట్లో ఒక మెలిక ఉంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ ఒక గంట మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గంటలోపు 10GB డేటా పూర్తయిపోయినా 64Kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా వినియోగించుకోవచ్చని రిలయన్స్ జియో తెలిపింది. రోజువారీ డేటా అయిపోయినవారు.. స్వల్ప కాలానికి ఈ బూస్టర్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చ. లేదా ఎక్స్‌ట్రా డేటా అవసరం పడినప్పుడు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈ ప్లాన్‌లో ఉన్న అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే.. ఫ్లెక్సిబిలిటీ. మీకు ఇక్కడ బేస్ ప్లాన్ లేకపోయినా .. డేటా వోచర్ పనిచేస్తుంది. అయితే కేవలం డేటా మాత్రమే పొందొచ్చని గుర్తుంచుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u