Meal Maker Biryani:మీల్ మేకర్ బిర్యానీ ఇలాచేస్తే గ్రేవీ చేయాల్సిన పనిలేదు
Meal Maker Biryani:సోయా బిర్యానీ.. వెజిటేరియన్స్ కి ఎంతో ఇష్టమైనా అలాగే అరోగ్యకరమైనా మిల్ మేకర్స్ తో బిర్యానీ ఇలా ట్రై చేయండి.సూపర్ టేస్టీ అండ్ ఈజీ. లంచ్ బాక్స్ లోకి చిటికెలో చేసుకొనే మీల్ మేకర్ పులావ్…
కావాల్సిన పదార్ధాలు
సోయా చంక్స్ – 1 కప్పు
బాస్మతి బియ్యం – 2 కప్పులు
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
ఓల్ గరం మసాలా – తగినంత
ఉల్లిపాయలు – 2
ఉప్పు – 1 టీ స్పూన్
పచ్చిమిర్చి – 4
క్యారేట్ – 1
బంగాళదుంప – 1
పచ్చిబఠానీలు – ½ కప్పు
పుదీనా – ½ కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
మిరయాల పొడి – ½ టీ స్పూన్
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
గరం మసాలా – ¼ టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
పెరుగు – ½ కప్పు
కొత్తమీర – కొద్దిగా
తయారీ విధానం
1.ముందుగా రెండు కప్పుల బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
2.ఇప్పుడు మిల్ మేకర్ ఉడికించడానికి ప్యాన్ లో నీళ్లు వేడి చేసి అందులో మిల్ మేకర్స్ నివేసి మరుగుతున్నప్పుడు స్టవ్ఆఫ్ చేసి పదినిమిషాల పాటు నాననివ్వండి.
3.పదినిమిషాల తర్వాత మిల్ మేకర్స్ ని వాటర్ లేకుండా స్క్వీజ్ చేసుకోవాలి.
4.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ వేడి చేసి అందులోకి నెయ్యి వేసి లవంగాలు,యాలకులు,చెక్క ,బిర్యానీ ఆకు,షాజీరా,వేసి నిమిషం పాటు వేపుకోవాలి.
5.ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారేట్, బంగాళ దుంపలు, పచ్చి బటానీలు, తగినంత ఉప్పు వేసి కలుపుకుని, మూత పెట్టి, 5 నిముషాలు ఉడికించాలి.
6.కప్పు పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, వేసుకుని, వేడి నీటిలో నానపెట్టిన, మిల్ మేకర్ను వేయాలి.
7.ఇప్పుడు అందులోకి జీలకర్రపొడి, గరం మసాల, పసుపు వేసి, నానపెట్టుకున్న బాస్మతి బియ్యం కోసం మూడు కప్పుల నీటిని వేసుకోవాలి.
8. అందులోకి హాఫ్ కప్పు పెరుగు వేస కలుపుకోవాలి.
9. మరిగే నీటిలో నానపెట్టిన బియ్యాన్ని వేసి, కలిపి మూత పెట్టుకోవాలి.
10.మీడియం ఫ్లేమ్ పై , నీరు దగ్గరపడే వరకు, ఉడికించి కొత్త మీర తరుగు చల్లుకుని, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u