Kitchenvantalu

Rajma Curry:ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి బలాన్నిచ్చే రాజ్మా గింజలతో మసాలా కూర..

Rajma Curry:రాజ్మా రెసిపీ..పంజాబీ స్పెషల్ రాజ్మా రెసిపి చపాతి ,పుల్కా లోకి సూపర్ కాంబినేషన్.ఉడికించిన రాజ్మాలో మసాలా వేసి ప్రిపేర్ చేసారంటే రుచి అదిరిపోతుంది.ఇది చాలా బలం కూడ.ఈసారి ట్రై చేసి చూడండి. ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి బలాన్నిచ్చే రాజ్మా గింజలతో మసాలా కూర..

కావాల్సిన పదార్ధాలు
రాజ్మా – 1 కప్పు
ఆయిల్ – 3 టేబుల్ స్పూన్స్
ఉల్లిపాయలు – 1 కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
టమాటో పేస్ట్ – 2-3
పసుపు – ¼ టీ స్పూన్
కారం – 2 టీ స్పూన్స్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
గరంమసాలా – ¼ టీ స్పూన్
కరివేపాకు – 2 రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా

తయారీ విధానం
1.ముందుగా రాజ్మాని నాలుగు ,ఐదు గంటలపాటు నానబెట్టుకోవాలి.
2.ఆపై నాలుగు,ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని అందులోకి ఆయిల్ వేడి చేసి జీలకర్ర,ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4.ఉప్పు వేసి ఉల్లిపాయలను మెత్తగా ఉడికించాలి.
5.అల్లం వెల్లుల్లి పేస్ట్,టమాటో పేస్ట్,పచ్చిమిర్చి,పసుపు,కారం వేసి కలిపి ఉడికించిన రాజ్మా వేసి కలుపుకోవాలి.

6.ఉడికించిన నీళ్లను కూడ యాడ్ చేసుకోవచ్చు.
7.గ్రేవి చిక్కగ రావాలంటే రాజ్మా పొడిని వేసి కలుపుకోవాలి.
8.గ్రేవి లోకి ధనియాల పొడి ,జీలకర్ర పొడి,గరంమసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి.
9.చివరగా కొత్తిమీర,కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోని సర్వ్ చేసుకోవడమే.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u