Dry Fruits Milkshake Recipe:డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎన్నీ లాభాలో తెలుసా.. ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి!
Dry Fruits Milkshake Recipe:డ్రైఫ్రూట్స్ మిల్క్ షేక్ ఎన్నీ లాభాలో తెలుసా.. ఇంట్లోనే ఇలా తయారు చెయ్యండి..వేసవి కాలంలో ఎక్కువగా మిల్క్ షేక్స్ తాగుతూ ఉంటారు.అయితే అన్ని కాలాల్లోను మిల్క్ shake తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మిల్క్ షేక్స్ ను ఇంట్లో తయారుచేసుకొని తాగితే మంచిది. ఈ మిల్క్ షేక్ కోసం ఒక పొడిని తయారుచేసుకొని స్టోర్ చేసుకుంటే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.
కావలసినపదార్థాలు:
కాచిన చల్లార్చిన పాలు: 1 గ్లాస్, బాదం: 8-10,పిస్తా: 8-10,ఖర్జూరం: 2,వాల్ నట్స్: 2,యాలకలపొడి: 1 స్పూన్,పంచదార: తగినంత,చాక్లెట్ క్రీమ్: 1 స్పూన్
తయారు చేయు విధానం:
ముందుగా బాదం,పిస్తా,ఖర్జూరం,వాల్ నట్స్ అన్నింటినీ మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. దానిలోనే పంచదార కూడా వేసి మరల ఒకసారి గ్రైండ్ చేయాలి. తర్వాత ఒక గ్లాస్ కాచి చల్లారిన పాలలో గ్రైండ్ చేసిన పొడిని రెండు స్పూన్స్ కలిపి బాగా బ్లెండ్ చేసి చాక్లెట్ క్రీమ్ తో గార్నిష్ చేస్తే చల్ల చల్లని మిల్క్ షేక్ రెడీ.
ఈ పౌడర్ ను గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవచ్చు. మనకు అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. దీనిని తయారుచేయటం కూడా చాల సులభం.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u