Vegetable Fried Rice । గరంగరంగా, రుచికరంగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండిలా త్వరత్వరగా..
Vegetable Fried Rice । గరంగరంగా, రుచికరంగా వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండిలా త్వరత్వరగా..వెజ్ ఫ్రైడ్ రైస్..లంచ్ బాక్స్ లోకి పిల్లలు ఇష్టంగా తినాలంటే,ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉండాలి. హెల్తీగా, టేస్టీగా, వెజిటేబుల్ రైస్, చేసి చూడండి.
కావాల్సిన పదార్థాలు
బాస్మతి రైస్ – 1 1/2 కప్పు
క్యాబేజ్ – 1 కప్పు
క్యాప్సికమ్ – 1/2కప్పు
క్యారేట్ – 1/2కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ – 1/2కప్పు
కొత్తిమీర – 1/2కప్పు
పచ్చిబఠానీలు -1/2కప్పు
ఉల్లిపాయలు – 1/2కప్పు
పచ్చిమిర్చి -3
ఉప్పు – తగినంత
మిర్యాల పొడి- ½ టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
వెనిగర్ – 1 టేబుల్ స్పూన్
సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
1.బాస్మతి బియ్యాన్ని, అరగంట ముందు నానపెట్టుకోవాలి.
2.స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, సగం వరకు నీళ్లను పోసి, ఉప్పును యాడ్ చేసుకుని నూనె వేసి ఎసరు మరగనివ్వాలి.
3.మరుగుతున్న ఎసరులో బాస్మతి బియ్యాన్ని వేసి, 70 పర్సెంట్ ఉడకనివ్వాలి.
4.ఇప్పుడు స్టవ్ పై వేరొక ప్యాన్ పెట్టి, అందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్, కప్పు ఉల్లిపాయలు, క్యారేట్ ముక్కలు, వేసి ఉడికించాలి.
5.ఉల్లిపాయలు వేగిన తర్వాత, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజీ,పచ్చి బటానీలు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి,లో ఫ్లేమ్ పై 5 నిముషాలు ఉడికించాలి.
6. అందులోకి ఉప్పు వేసి, కలిపి మూత పెట్టి, తక్కువ మంట పైన ఉడికించాలి.
7.కూరగాయలు ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, వెనిగర్ , సోయా సాస్, మిర్యాల పొడి, వేసి, 70 పర్సెంట్ ఉడికిన అన్నం వేసుకని కలిపి రెండు నిముషాలు ఉడికించి, కొత్తిమీర తరుగు, మరియు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని, ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u