Cabbage Pesarapappu Fry:పెసరపప్పు తో క్యాబేజ్ కలిపి ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది
Cabbage Pesarapappu Fry:పెసరపప్పు తో క్యాబేజ్ కలిపి ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుంది.. క్యాబేజీ ఫ్రై..క్యాబేజీ అంటే చాలా మంది ఇష్టపడరు.కాని ఆరోగ్యానికి ఎంతో మంచిది.కాబట్టి మన మెనులో క్యాబేజీ రెసిపీస్ను కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ పెసరపప్పుతో ఫ్రై చేసి చూడండి.తప్పకుండా నచ్చుతుంది.
కావాల్సిన పదార్ధాలు
క్యాబేజీ – 1/2కేజీ
పెసరపప్పు – 1/2కప్పు
పచ్చిమిర్చి – 7 లేదా 8
ఉల్లి పాయలు – 1/2కప్పు
కరివేపాకు – 1/2కప్పు
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – 1 1/2 టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టీ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం
1.ముందుగా పెసరపప్పును, అరగంట పాటు నానపెట్టుకోవాలి.
2. స్టవ్ పై కడాయి పెట్టి, నూనె వేడి చేసి, అందులోకి, జీలకర్ర, వేసి ఉల్లిపాయలను, రెండు నిముషాలు వేపుకోవాలి.
3.పచ్చిమిర్చి,పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసుకుని నిముషం పాటు వేపుకోవాలి.
4.ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన క్యాబేజీ వేసి, 5 నిముషాలు ఉడికించాలి.
5.రుచికి సరిపడా ఉప్పు వేసి, నాన పెట్టుకున్న పెసరపప్పును వేసి, కలిపి, మూత పెట్టి 10 నిముషాలు లో ఫ్లేమ్ పై ఉడికించాలి.
6. అంతే క్యాబేజీ పెసరపప్పు ఫ్రై రెడీ.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u