Heel Pain:ఇలా చేస్తే మడమ నొప్పి నిమిషంలోనే తగ్గిపోతుంది…మళ్ళీ రాదు
Heel Pain home Remedies in telugu: మడమ నొప్పి అనేది ఎక్కువగా మహిళల్లో కనపడుతుంది. మడమ నొప్పి రావటానికి అధిక బరువు, సరైన షూస్ వేసుకోక పోవడం, ఫ్రాక్చర్స్, స్ప్రైయిన్స్, గాయాలు వంటివి కారణాలుగా చెప్పవచ్చు. మడమ నొప్పి ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు బాగా హెల్ప్ చేస్తాయి. చెప్పులు లేకుండా నడవకూడదు.
అర బకెట్ గోరువెచ్చటి నీటిలో మూడు టేబుల్ స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ను వేసి దానిలో పాదాలను ఉంచి, పాదంతో మరొక పాదాన్ని నెమ్మదిగా రుద్దుతూ ముందుకు వెనక్కి కదిలించాలి. ఇలా 10 నిమిషాల పాటు చేయాలి. ఇలా చేస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఎప్సమ్ సాల్ట్ లో ఉండే మెగ్నీషియం సల్ఫేట్ నొప్పి, వాపు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.
ఒక గ్లాస్ పాలను వేడి చేసి పావుస్పూన్ లో సగం పసుపును వేసి బాగా కలిపి తాగాలి. పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల నొప్పిని సహజసిద్దంగా తగ్గిస్తాయి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఆవనూనెతో మసాజ్ చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
అల్లం కూడా నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, పెయిన్ రిలీవింగ్ లక్షణాలు ఉండుట వలన నొప్పిని, మరియు ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అల్లం టీ తాగితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u