Kitchenvantalu

Spicy Potato Curry:ఆలూ మసాలా కర్రీ కమ్మని గ్రేవీతో రుచి అదిరిపోద్ది..

Spicy Potato Curry: దక్షిణ భారత బంగాళాదుంప కూర అనేది ఒక స్పైసీ సైడ్ డిష్, ఇది సాధారణంగా మధ్యాహ్న భోజనంలో అన్నంతో పాటుగా తయారు చేయబడుతుంది.

స్పైసీ పొటాటో కర్రీ..ఈజీగా టేస్టీగా అందరూ ఇష్టపడే కర్రీస్ లో,ఆలూ ఒకటి. బగారా ఫ్రైడ్ రైస్ బిర్యాన్ని లోకి,స్పైసీ ఆలు కర్రీ ఎలా ప్రీపేర్ చేసుకోవాలో చూద్దాం

కావాల్సిన పదార్ధాలు
బంగాళ దుంపలు – 300 గ్రాములు
జీలకర్ర – ½ టీ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
కొబ్బరి పొడి – 2 టీ స్పూన్స్
కారం – 1 ½ టీ స్పూన్
ఉప్పు – 1 ½ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
ఉల్లి పాయలు – 1 కప్పు
పచ్చిమిర్చి – 2
కొత్తిమీర – 1/2కప్పు
అల్లం వెల్లుల్లిపేస్ట్ – 1 టీ స్పూన్
గరం మసాల – ¼ టీ స్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేసి, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి,నిముషం పాటు వేపుకోవాలి.
2.ఉల్లిపాయలు వేగిన తర్వాత కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి, బంగాళ దుంప ముక్కలను కలుపుకుని,మూత పెట్టి, రెండు నిముషాలు లో ఫ్లేమ్ లో ఉడికించాలి.
3. 1 ½ కప్పు నీళ్ల ను పోసి, గ్రేగీ చిక్క పడేవరకు ఉడికించాలి.
4.చివరగా గరం మాసాల, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u