Healthhealth tips in telugu

Gas Problem:టాబ్లెట్ కంటే స్పీడ్ గా గ్యాస్ ట్రబుల్,కడుపు ఉబ్బరం,అజీర్ణం అన్నింటిని తగ్గిస్తుంది

Gas Problem Home Remedies in telugu : ఈ వేసవిలో జీర్ణ సమస్యలు అయిన గ్యాస్,కడుపు ఉబ్బరం,కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. టాబ్లెట్ ల జోలికి వెళ్లవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉండే కొన్ని దినుసులను ఉపయోగిస్తే ఆ సమస్యల నుండి సులభంగా బయట పడవచ్చు.
jeelakarra Health Benefits in telugu
జీలకర్ర జీర్ణ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. పొయ్యి మీద ఒక గ్లాస్ నీటిని పెట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసి 5 నిమిషాలు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి ఒకటి లేదా రెండు సార్లు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. జీలకర్రను వెగించి మెత్తని పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ జీలకర్ర పొడిని కలిపి కూడా తాగవచ్చు.

వాము జీర్ణ సమస్యలను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఆముమ్మల కాలం నుండి వామును వాడుతున్నారు. కాస్త గ్యాస్,కడుపు నొప్పి సమస్యలు ఉన్నప్పుడు అరస్పూన్ వాములో చిటికెడు ఉప్పు కలిపి నోట్లో వేసుకొని నములుతూ రసాన్ని మింగాలి. వెంటనే గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.

అల్లం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లంలో ఉండే జింజీరాల్ అనే సమ్మేళనం గ్యాస్ సమస్యను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే వ్యాధులు రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఒక గ్లాస్ నీటిలో అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని తాగాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u