Drumsticks:వారంలో 2 సార్లు మునక్కాయలను తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…!
Drumsticks health benefits In Telugu : మునక్కాయతో కూర, pulusu,సాంబార్ వంటివి చేసుకుంటూ ఉంటారు. మునక్కాయను చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు.
మన చుట్టూ ఉండే కాయగూరల్లో, ఆకు కూరలులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.వాటిని మనం వండుకుని తినడం వలన.ఎన్నో మొండి వ్యాధులను నయం చేయవచ్చు.ముఖ్యంగా మునక్కాయలు ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో ఉపయోగపడతాయి.మునక్కాయలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మునక్కాయ లో చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్ని బాగాలు ఉపయోగపడేవే.
మునగాకుతో వంటలు వండుకుని తినడం వలన మనకి అప్పుడప్పుడు వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.లావుగా ఉండేవాళ్ళు మునగాకుతో చేసిన కూరల్ని తినడం వలన బరువు క్రమంగా తగ్గుతారు. ఇందులోని విటమిన్-సి ఎముకలను ఇంకా ధృఢంగా చేస్తుంది.విటమిన్ ఎ-సినే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది
ఈ మునగాకు మధుమేహం రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తుంది.జీర్ణశక్తిని పెంచుతుంది.దీనిలో ఉండే విటమిన్ ఏ ద్వారా కళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మునక్కాయలు రోజు ఆహారంలో ఉండేలా చూసుకుంటే పురుషులలో వీర్య వృద్ది పెరుగుతుంది.
మునక్కాయలో ఉండే పీచు మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది. ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిది. మునక్కాయను కూరగా లేదా సాంబార్ లో వేసుకొని తినవచ్చు. మసాలా కర్రీగా కూడా చేసుకోవచ్చు. లేదా మునక్కాయను ఉడికించి కూడా తినవచ్చు. మునక్కాయను ఎలా తీసుకున్న వాటిలో పోషకాలు,ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u