Joint Pains:కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు తింటే ఏమవుతుందో తెలుసా ?
Curd health Benefits in Telugu :చలికాలంలో కీళ్ళనొప్పులు కాస్త ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆహారంలో మార్పులు తప్పనిసరిగా ఉండాలి. తీసుకొనే ఆహారం విషయంలో చాలా శ్రద్ద పెట్టాలి.
పెరుగు అనేది ప్రతి ఒక్కరు భోజనంలో ఇష్టపడి తింటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పెరుగు అన్నం లేకుండా భోజనం పూర్తి కాదు. పెరుగులో Calcium, పొటాషియం,మెగ్నీషియం,సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
పెరుగు లో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పెరుగులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం తినటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు పెరుగు తింటే నొప్పులు ఎక్కువ అవుతాయి. ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు తింటే కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి
అయితే పెరుగు తినాలని అనుకునేవారు పెరుగు కు బదులుగా మజ్జిగ వాడవచ్చు అయితే మజ్జిగలో బెల్లం కలుపుకుని తీసుకుంటే ఎముకలు కండరాలు దృఢంగా మారి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా అలసట వంటివి కూడా తొలగిపోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటే మంచిది
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u