Kitchenvantalu

Kanda Bachali Kura : కార్తీకమాసంలో ఒక్కసారి అయిన తినవలిసిన కంద బచ్చలి ఆవపెట్టిన కూర

Kanda Bachali Curry Recipe: కార్తీకమాసంలో ఒక్కసారి అయిన తినవలిసిన కంద బచ్చలి ఆవపెట్టిన కూర.. తరుచు చేసుకునే వంలల లిస్టుల ఓ లేకపోయినా అప్పుడప్పుడు కొన్ని వంటల రుచులు చూసి తీరాల్సిందే.అందులో కంద గడ్డ కూడ ఒకటి.కంద గడ్డ బచ్చలి కూర వేసి చేసారంటే ముద్ద కూడ మిగల్చకుండా తినేస్తారు.ఎందుకు ఆలస్యం తయారి విధానం చూసేద్దాం.

కావాల్సిన పధార్ధాలు
కంద- 250 గ్రాములు
బచ్చలి ఆకులు- చిన్న కట్ట
ఉప్పు-తగినంత
పచ్చిమిర్చి- 3
చింతపండు రసం- 1.5 టేబుల్ స్పూన్
పసుపు- 1/8 టీస్పూన్
నీళ్లు- ½ లీటర్
జీలకర్రపొడి- 1 టీస్పూన్

ఆవాల పేస్ట్ కోసం..
ఆవాలు- 1.5 టీస్పూన్
అల్లం – 1 ఇంచ్
ఎండుమిర్చి – 2
ఉప్పు- తగినంత
పసుపు- ¼ టీస్పూన్
నూనె – 1 టీస్పూన్

తాలింపు కోసం..
నేనె – 2 టేబుల్ స్పూన్స్
పల్లీలు- 2 టేబుల్ స్పూన్స్
ఆవాలు – ½ టీస్పూన్
మినపప్పు- 1టేబుల్ స్పూన్
పచ్చి శెనగపప్పు- 1 టేబుల్ స్పూన్
ఎండు మిర్చి- 2
కరివేపాకు- 2 రెబ్బలు
ఇంగువ- 2 చిటికెలు

తయారి విధానం
1.గిన్నెలో నీళ్లు పోసిఅందులోకి కంద గడ్డను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోని,బచ్చలి ఆకులు,పసుపు వేసి ముక్కలు తొబ్బై శాతం ఉడికించుకోవాలి.
2.స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు వేసుకోని పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు ఆవాల పేస్ట్ కోసం పక్కన పెట్టుకున్న పధార్ధాలను మిక్సి జార్ లో వేసుకోని మెత్తని పేస్ట్ లచేసుకోని నూనె వేసి పక్కన పెట్టుకోవాలి.
4.ఉడికి కంద ,బచ్చలిని వడకట్టుకోని పప్పుగుత్తి సాయంతో కచ్చపచ్చాగా మెదుపుకోవాలి.వడకట్టిన నీళ్లను కలిపి పల్చగా చేసుకోవాలి.

5.మెదుపుకున్న కంద లోకి పచ్చిమిర్చి ,చింతపండు రసం,ఆవాల పేస్ట్ వేసుకోని బాగా కలుపుకోవాలి.
6.ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని నూనె వేడెక్కాక పల్లీలు వేసి అవి వేగాక ఆతరువాత తాలింపులు వేసుకోని వేగిన తాలింపులు కంద కూరలోకి వేసుకోని బాగ కలుపుకోవాలి.
7.అంతే కమ్మని కంద బచ్చలి కూర రెడి అయినట్టే.
Click Here To Follow Chaipakodi On Google News