Joint Pains:కేవలం 2 సార్లు రాస్తే చాలు మోకాళ్ళు,కీళ్ళు,నడుము నొప్పి అన్నీ మాయం అవుతాయి
Joint pains Home Remedies in telugu : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు అనేవి 55 నుంచి 60 ఏళ్ళు వచ్చేసరికి వచ్చేవి. కానీ మారిన జీవనశైలి కారణంగా చాలా చిన్న వయస్సులోనే అంటే 35 ఏళ్ళు వచ్చేసరికి నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇలా నొప్పులు రాగానే మనలో చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.
అలా కాకుండా ఇంటి చిట్కాలను పాటిస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ రెమిడీ కోసం కలబందను తీసుకొని సైడ్ ముల్లులను తొలగించి పై తొక్క తీసి లోపల గుజ్జును వేరు చేయాలి. ఈ గుజ్జు అరకప్పు ఉండేలా చూసుకోవాలి. మిక్సీ జార్ లో కలబంద గుజ్జు,ఒక స్పూన్ తెల్ల నువ్వుల నూనెను వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
ఈ పేస్ట్ ని బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో అరస్పూన్ పసుపు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి దగ్గరకు వచ్చాక పొయ్యి మీద నుంచి దించాలి.
పచ్చి పసుపు దొరికితే కోరి కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమం 7 రోజుల పాటు నిల్వ ఉంటుంది. నొప్పులు ఉన్న ప్రదేశంలో ఆవనూనె రాసి మసాజ్ చేసి ఆ తర్వాత తయారుచేసుకున్న మిశ్రమాన్ని రాసి గంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా రోజులో ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎముకలకు బలాన్ని అందించి నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. అలాగే పసుపులో ఉండే లక్షణాలు నొప్పుల నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u