Breakfast Ideas:ఈ ఇడ్లీ తింటే చాలు విపరీతమైన ప్రోటీన్ లభిస్తుంది…ప్రోటీన్ లోపం అనేది ఉండదు
Breakfast sprouts idli at home : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ద పెడుతున్నారు. దాంతో మంచి పోషకాలు ఉన్న ఆహారం తినటానికి ప్రయత్నం చేస్తున్నారు. మొలకెత్తిన గింజల వాడకం కూడా చాలా ఎక్కువ అయింది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మనలో చాలా మంది మొలకెత్తిన గింజలు తినాలంటే పెద్దగా ఆసక్తి చూపరు. ఎందుకంటే అవి రుచిగా ఉండవని ఇష్టపడరు. అయితే కొంతమంది గ్యాస్ సమస్య వస్తుందని తినరు.
అలాంటివారు మొలకెత్తిన గింజలతో ఇడ్లీ తయారు చేసుకుని తింటే రుచిగా ఉండటమే కాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్నీ లభిస్తాయి. ఇప్పుడు మొలకెత్తిన గింజలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కాస్త ఓపికగా చేసుకుంటే మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
మిక్సీ జార్ లో అర కప్పు మొలకెత్తిన శనగలు, అరకప్పు మొలకెత్తిన పెసలు, ఒక కప్పు పెరుగు, అరకప్పు ఓట్స్, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, రెండు పచ్చిమిర్చి వేసి మెత్తని ఇడ్లీ పిండిగా మిక్సీ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఇడ్లీ రేకులపై మీగడ రాసి ఇడ్లీలుగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి.
ఈ ఇడ్లీలను అన్ని వయసుల వారు తినవచ్చు. వారంలో రెండుసార్లు తింటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రోటీన్ లోపంతో బాధపడే వారికి ఈ ఇడ్లీలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే .ఫైబర్ మరియు ఎన్నో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ ఇడ్లీలు మొలకెత్తిన గింజలు తినలేని వారికి మాత్రమే.
మొలకెత్తిన గింజలు తింటేనే వాటిలో ఉన్న పోషకాలు అన్ని మన శరీరానికి అందుతాయి. ఇలా ఇడ్లీలా తయారు చేసుకుంటే కొన్ని పోషకాలు తగ్గుతాయి. కాబట్టి మొలకలను తినలేని వారు ఇలా ఇడ్లీ చేసుకొని తింటే మంచి ప్రయోజనాలను పొందుతారు. పెసలు,శనగలు రెండింటిలోను ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉంటాయి. బరువు తగ్గాలని అనుకొనేవారికి కూడా మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
చిన్న పిల్ల నుండి పెద్దవారి వరకు అందరూ ఈ ఇడ్లీలను తినవచ్చు. ఈ ఇడ్లీల కోసం తీసుకున్న అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే డయాబెటిస్,అధిక బరువు సమస్యతో బాధపడేవారికి కూడా మంచి ఎంపిక అని చెప్పవచ్చు. steel cut oats వాడితే మంచిది. ఇవి online లో అందుబాటులో ఉంటాయి. శనగలు,పెసలు చాలా విరివిగానే లభ్యం అవుతాయి. కాబట్టి తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u