Beauty Tips

White Hair: జుట్టు ఊడకుండా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే.. ఈ మొక్క ఉంటే చాలు..

White Hair: జుట్టు ఊడకుండా, తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే.. ఈ మొక్క మీ జుట్టును నల్లగా మారుస్తుంది..మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిలో ఉన్న ప్రయోజనాలు తెలియక ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తాం. అయితే వాటిలో ఉండే ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా యుక్త వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తోంది దాంతో చాలా బాధపడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు దాటాక మాత్రమే జుట్టు తెల్లగా మారేది. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా చాలా తక్కువ వయసులోనే అంటే 30 ఏళ్లకే జుట్టు తెల్లగా మారిపోతుంది.

దాంతో మానసికంగా కృంగిపోయి రంగులు వేయడం స్టార్ట్ చేసేస్తున్నారు.రంగులు అనేవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలే సమస్య కూడా పెరిగిపోతుంది. అదే సహజసిద్ధమైన చిట్కాలు ఫాలో అయితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది దీని కోసం గుంటకలగర ఆకు చాలా బాగా పనిచేస్తుంది. ఇది పల్లెటూర్లలో ఎక్కడపడితే అక్కడ ఉంటుంది.

మార్కెట్లో కూడా లభ్యమవుతుంది. గుంటకలగర ఆకులో ఉండే లక్షణాలు జుట్టును నల్లగా మార్చుతాయి. కొన్ని గుంటకలగర ఆకులను తీసుకొని బాగా ఎండబెట్టి పొడి తయారు చేసుకోవాలి. ఈ పొడిని నువ్వులనూనె లో వేసి బాగా కలిపి జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి గంటయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారానికి రెండుసార్లు చేస్తుంటే మంచి ఫలితం వస్తుంది. గుంటకలగర ఆకు పొడి రూపంలో మార్కెట్లో దొరుకుతుంది ఫ్రెష్ గా ఉన్న ఆకు దొరికిన సరే లేదా మార్కెట్లో దొరికే పొడిని ఆయన ఉపయోగించవచ్చు.

జుట్టు సమస్యలకు చెక్ పెట్టటమే కాకుండా ఈ ఆకులను నీటితో మెత్తగా నూరి ఆ ముద్దను గజ్జి, తామర, దద్దుర్లు, దురదలు, పుండ్లు, కురుపులు, గాయాలు తదితర చర్మ సమస్యలకు పై పూతగా వేయాలి. గంట తరువాత స్నానం చేస్తే క్రమంగా ఇవి సమసిపోతాయి.

తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే రావటం వలన చాలా కంగారు పడి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడుతున్నారు. అలా వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సహజసిద్దంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకొనే ప్రయత్నాలు చేయాలి.

గుంటకలగర ఆకు గురించి పల్లెటూర్లలో ఉండే వారికీ సుపరిచతమే. ఈ మొక్క చాలా సులభంగా పెరుగుతుంది. గుంటకలగర ఆకును తెచ్చుకొని నీడలో ఆరబెట్టి పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. కాబట్టి ఈ ఆకును వాడటం వలన దాదాపుగా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ఒక్క మొక్క ఇంటిలో ఉంటే తెల్లజుట్టుకు చెక్ పెట్టవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u