Moringa smoothie recipe:వారంలో 3 సార్లు ఈ ఆకును ఇలా తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు
Moringa smoothie recipe : ఆకుకూరల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. అలాంటి వాటిలో మునగాకు ఒకటి. కొన్ని అధ్యయనాల ప్రకారం శనగల పాలు, పెరుగు, జున్ను కంటే ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్నాయి. అంతేకాదు, కాల్షియం లోపాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మునగాకుతో చాలామంది పప్పు చేసుకుంటారు. అలాగే ఆకులను ఎండబెట్టి వేగించి పొడిగా తయారు చేసుకుంటారు. అయితే కొంతమంది మునగాకు తినటానికి ఇష్టపడరు. అయితే వీటిలో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తినని వారు కూడా ఖచ్చితంగా తింటారు.
మునగాకులో విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మునగాకుతో స్మూతీ తయారు చేసుకుని తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. గుప్పెడు మునగ ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక యాపిల్ తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నాలుగు ఖర్జూరాలను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో మునగాకు, కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, గ్లాసున్నర కొబ్బరి పాలు, ముక్కలుగా కట్ చేసిన ఖర్జూరాలు, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా చేసుకోవాలి.
ఈ విధంగా తయారుచేసుకున్న స్మూతీని వారంలో మూడు సార్లు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రోజుల్లో అధిక బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. అధిక బరువు., శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి బాగా సహాయపడుతుంది. అధిక బరువు ఉన్నవారికి మంచి ఆరోగ్యకరమైన ఎంపిక అని చెప్పవచ్చు.
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచి చెడు కొలెస్ట్రాల్ లేకుండా చేసి రక్తప్రసరణ బాగా సాగేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అదే విధంగా, ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలని బలంగా చేస్తుంది. పాలలో 123 మిల్లీ గ్రాముల కాల్షియం అందిస్తే, అదే మొత్తంలో మునగాకు పొడిలో 2667 మిల్లీగ్రాముల కాల్షియం అందుతుంది.
రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ smoothie తాగితే లిపిడ్ ప్రొఫైల్ తగ్గించి చెడు కొలెస్ట్రాల్ నుండి రిలీఫ్‌ని ఇస్తుంది. కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు తాగి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u