Red Guava Benefits:ఎర్ర జామపండు ఎప్పుడైనా తిన్నారా…ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు…
Red Guava Health Benefits In telugu : అన్ని పండ్లలో జామ పండు ఎంతో రుచికరమైనది..ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. భారతీయులు ఎక్కువగా జామపండ్లను కట్ చేసుకుని రుచి కోసం బ్లాక్ సాల్ట్ లేదా చాట్ మసాలాతో తీసుకుంటారు. అయితే ఈ పండ్లను ప్రతి రోజు తీనడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అయితే తెల్ల జామకు బదులుగా ఎర్రనివి తీసుకోవడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎర్ర జామపండులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పచ్చి ఎర్ర జామపండు తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో యాంటీ కఫం, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి
మనలో చాలా మందికి ఎర్ర జామకాయ గురించి పెద్దగా తెలియదు. ఈ జామపండులో ఎన్నో పోషకాలు,ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకి ఒక ఎర్ర జామపండు తింటే ఎన్నో ఊహించని ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పండులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటమే కాకుండా చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది.
మెగ్నీషియం సమృద్దిగా ఉండుట వలన కండరాల తిమ్మిరి తగ్గించటమే కాకుండా కండరాలు ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. విటమిన్ ఏ, ప్లేవనాయిడ్స్ అయిన బీటాకెరోటిన్లైకోపిన్ ఉండుట వలన లంగ్స్, చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
పొటాషియం సమృద్దిగా ఉండుట వలన రక్త ప్రవాహం బాగా సాగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ పండు తింటే అలసట,నీరసం తగ్గి చురుకుగా ఉంటారు. బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉండుట వలన రక్తకణాల వృద్దికి సహాయపడుతుంది. అధిక బరువు సమస్య నుండి బయట పడవచ్చు.
డయాబెటిస్ ఉన్నవారు ప్రతి రోజు ఒక ఎర్ర జామ పండు తింటే చాలా మంచిది. ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండుట వలన షుగర్ లెవల్స్ ఆకస్మిక పెరుగుదలను నిరోధించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకొనే ఆహారం మీద ప్రత్యేకమైన శ్రద్ద పెట్టవలసిన అవసరం ఉంది.
ఎర్ర జామపండులో ఉన్న ప్రయోజనాలు తెలిసాయి కదా…ఈ పండు కనపడితే తప్పనిసరిగా తిని ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందండి. ఒకప్పుడు చాలా అరుదుగా లభించే ఎర్ర జామ కాయ ప్రస్తుతం చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u