Clove benefits:ఉదయాన్నే పరగడుపున లవంగాలు తింటే ఎన్ని లాభాలో తెలుసా…అసలు నమ్మలేరు
Clove Benefits in Telugu : లవంగాలు.. మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్పగుణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
లవంగాలను మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాల గురించి పూర్తిగా తెలియదు.లవంగాలను మసాలా దినుసులలో రారాజు గా పిలుస్తారు. ముఖ్యంగా ఈ సీజన్ లో లవంగాలను తీసుకోవటం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.
.
లవంగాలలో విటమిన్ సి, ఫైబర్, మాంగనీస్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. లవంగాల నీటిని తీసుకోవచ్చు లేదా రెండు లవంగాలను బుగ్గన పెట్టుకుని నమిలి రసాన్ని మింగవచ్చు. లవంగాల నీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లవంగాలను వేయించి పొడి చేసుకొని నిలువ చేసుకోవాలి.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పొడి కలిపి ఉదయం పరగడుపున తాగాలి. లేదంటే రాత్రి పడుకునే ముందు రెండు లవంగాలను నమలాలి. అలా కాకుంటే రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లవంగాలు నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగాలి. లవంగాలను ఎలా తీసుకున్నా సరే వాటిలో ఉన్న ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.
అయితే ఉదయం సమయంలో పరగడుపున తీసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా చలికాలంలో లవంగం తీసుకోవటం వలన జీర్ణక్రియను మెరుగు పరచుటమే కాకుండా అధిక బరువు సమస్య తగ్గటానికి సహాయపడుతుంది. చలికాలంలో జీర్ణ సంబంద సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
జీవక్రియను వేగవంతం చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దంత సమస్యలను తగ్గిస్తుంది. దంత సమస్యలు ఉన్నప్పుడూ పంటి కింద లవంగం మొగ్గను పెట్టుకుంటే సరిపోతుంది. డయాబెటిస్ ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది.
లవంగాలు బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, మన రక్తాన్ని క్లీన్, హెల్దీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి.
లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్స్‌తో పోరాడడంలో హెల్ప్ చేస్తాయి. లవంగాల్లోని ఎల్లాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సాయపడతాయి.
లవంగాల్లో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి స్పీడ్‌గా బరువుని తగ్గిస్తాయి. ఇందులో యూజినాల్, యాంటీ ఆక్సిడెంట్, డైటరీ ఫైబర్, విటమిన్స్ ఈ, సి, కె, ఎలు ఉన్నాయి. ఇవి జీవక్రియని పెంచి, కేలరీలను వేగంగా బర్న్ చేస్తాయి. ఈ విధంగా ఇది కొవ్వుని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u