Uric Acid:యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఉదయం ఈ నీటిని తాగితే…ముఖ్యంగా కీళ్ల నొప్పులు ఉన్నవారు
How to Reduce uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే చాలా డేంజర్. యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే తరుచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా యూటీఐ లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు.
ఈ మధ్యకాలంలో చాలామంది యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలు యూరిక్ యాసిడ్ ని బయటకు పంపించ లేకపోతే మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇలా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అనేక రకాల సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు.
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ చెప్పిన ప్రకారం మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా యూరిక్ యాసిడ్ సమస్య నుంచి బయటపడవచ్చు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరం సహజంగా విసర్జించే వ్యర్థ పదార్థాలలో ఒకటి. .
మనం తీసుకునే ఆహారంలో ప్యూరిన్ అనే రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలా విసర్జన సరిగ్గా జరగకపోతే ఈ యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో నిలిచిపోయి స్పటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోయి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు వస్తాయి.
అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు, డయాబెటిస్ వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. సాధారణంగా పురుషులలో 3.4-7.0 mg వరకు యూరిక్ యాసిడ్, మహిళల్లో 2.4- 6.0 mg వరకు యూరిక్ యాసిడ్ ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. నిమ్మకాయ శరీరంలో యూరిక్ యాసిడ్‌ను తగ్గించడానికి సహాయపడుతుందని ఇటీవల జరిగిన పరిశోదనల్లో తేలింది.
నిమ్మకాయ తీసుకుంటే.. శరీరంలో ఆల్కలీన్ ప్రభావం పెరుగుతుంది, దీని వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి. నిమ్మకాయలో ఉండే.. విటమిన్ C యూరిక్ యాసిడ్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం కలపాలి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఈ నీటిని వారం రోజులు తాగితే.. తేడా మీకే తెలుస్తుంది.
చాలా మంది యూరిక్ యాసిడ్‌ను తగ్గించేందుకు వైద్యుల్ని సంప్రదించి నానా రకాల మందులు వాడుతున్నారు. అయితే, కొన్ని రకాల ఫుడ్స్ కూడా తిని నేచురల్‌గా యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. బరువు అధికంగా ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం, డ్రింక్స్‌లో ఉండే ప్యూరిన్స్ అనే రసాయనాల్ని శరీరం విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. బిజీ లైఫ్ స్టైల్, ఎలా పడితే అలా తినడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం ఇవన్నీ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతున్నాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u