Lungs Health:ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫమును కరిగించి గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది
Lungs Health home Remedies: పెరిగిపోతున్న కాలుష్యం, అపరిశుభ్ర పరిసరాలు, స్మోకింగ్ , వివిధ రకాల వైరస్‌లు ఊపిరితిత్తులను నాశనం చేస్తున్నాయి. వీటి కారణంగా.. ఆస్తమా, లంగ్ ఇన్‌ఫెక్షన్లు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచుకోవడం ముఖ్యం. ఊపిరితిత్తులను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి.. ఆయుర్వేదంలో అనేక ఔషదాలు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం విపరీతమైన మంచు కురుస్తుంది. ఈ సమయంలో దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్ వచ్చేసి అది ఊపిరితిత్తుల్లో కఫం పెరగ టానికి కారణం అవుతుంది. ఇలాంటి సమయంలో ఊపిరి తీసుకోవడంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమస్యలను ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అసలు అశ్రద్ద చేయకూడదు.
ఈ సమస్యను తగ్గించడానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక రోటిలో పది మిరియాలు, ఒక స్పూన్ వాము, పది లవంగాలు, అంగుళం అల్లం ముక్క వేసి దంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి దంచిన మిశ్రమాన్ని వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించాలి.
ఈ నీటిని వడకట్టి అర గ్లాసు చొప్పున ఉదయం, సాయంత్రం రెండు రోజుల పాటు తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గి జలుబు, దగ్గు నుంచి చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. లవంగాలు, నల్ల మిరియాలు జీర్ణక్రియను మెరుగు పరచి బరువు తగ్గడానికి సహాయపడుతాయి.
ఈ డ్రింక్ ఆస్తమా రోగులకు కూడా బాగా పనిచేస్తుంది. అల్లం లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జలుబు., వైరస్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. సమస్య చిన్నగా ఉంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ సూచన పాటించాలి. అలా పాటిస్తూ ఈ డ్రింక్ తాగితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.
ఈ డ్రింక్ కి ఉపయోగించిన మిరియాలు, వాము, లవంగాలు, అంగుళం అల్లం ముక్కలలో ఉన్న పోషకాలు ఈ సీజన్ లో చాలా బాగా సహాయపడతాయి. సీజనల్ గా వచ్చే అన్ని రకాల సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో రోగనిరోదక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి in ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది.
వర్షాకాలంలో ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి ఊపిరితిత్తులలో కఫం పేరుకుపోయి అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం, వాటి సామర్థ్యం పెంచుకోవడం ముఖ్యం. ఊపిరితిత్తులను స్ట్రాంగ్‌గా ఉంచుకోవడానికి.. ఇప్పుడు చెప్పిన డ్రింక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u