December Flower:ఈ పూల మొక్క మీ ఇంటిలో ఉందా…అయితే ఈ ప్రయోజనాల గురించి తెలుసుకోండి
December Flower Benefits : పల్లెటూర్లలో ప్రతి ఇంటిలోనూ దాదాపుగా ఇప్పుడు చెప్పే పూల మొక్కలు ఉంటాయి. అలాగే ఇంటి ముందు, రోడ్డు పక్కన కూడా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్టు పేరు డిసెంబర్ పూల చెట్టు. ఈ పూలను ఎక్కువగా మాల కట్టి జడలో అలంకరించుకోవడానికి, అలాగే దేవుని పూజకు సమర్పించడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
చలికాలం రాగానే వాకిట్లో ఫ్లవర్‌వేజ్ పెట్టినట్టు చెట్టునిండా పూస్తాయి డిసెంబర్ పూలు. ఇక, పూల బుట్ట చేత బట్టి, అందమైన మాల కట్టి జడతో దానికి జట్టు కట్టడమే మన పని. పొడవుగా ఉండే పూలు కనుక లావైన దండ ముస్తాబవుతుంది వీటితో. ఈ నెలలో పూస్తాయి కాబట్టి డిసెంబర్ పూలు అంటాం కానీ వీటి అసలు పేరు బార్లీరియా. ఇందులో 300 రకాల దాకా రకాలు ఉన్నాయట.
సీజనల్ గా వచ్చే పువ్వులు ఎన్ని ఉన్నా డిసెంబర్ పూలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. బంగారు వర్ణం., తెలుపు, లేత గులాబీ,వంకాయ రంగులో ఉంటాయి. ఈ పువ్వులు డిసెంబర్ నెల ప్రారంభం నుండి ఫిబ్రవరి నెల వరకు బాగా పుస్తాయి. ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మొక్క ఆకులను దగ్గు., న్యూమోనియా చికిత్సలో వాడతారు. ఆకులు., వేర్లు జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ఈ మొక్కను రక్తహీనతతో బాధపడేవారికి ఔషధంగా కూడా వాడుతుంటారు. అలాగే రక్త శుద్ధి కోసం, డయాబెటిస్ నియంత్రణ లోనూ ఉపయోగిస్తారు.
ఈ మొక్క వేరు రసాన్ని అజీర్ణ సమస్యకు ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఈ మొక్క ఆకు రసాన్ని కాలిన గాయాల వాపుకు తగ్గించడానికి వాడతారు. అయితే ఇటువంటి ఆకులను, వేర్లను వాడేముందు ఒకసారి ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకుంటే మంచిది. మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటి ప్రయోజనాలు తెలుసుకుంటే మనకు సహాయపడతాయి.
పూర్వకాలపు మందుల నుంచీ నేటి మోడ్రన్ మెడిసిన్ వరకూ వివిధ వ్యాధులకు ఔషధంగా వినియోగిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రశస్తి ఉంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ వైరల్ గుణాలున్న ఇది చిగుళ్ల నుంచి రక్తాన్ని కారడం ఆపడంతో పాటు, అల్సర్లను నివారిస్తుంది.
దీని వేళ్లను పాము, తేలు కాటుకు చేసే వైద్యంలో వినియోగిస్తారు. దీని ఆకుల రసాన్ని కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు వాడతారు. ఇక, ఎంతో అందంగా చెట్టు నిండా విరబూసే ఈ పూలు సీతాకోక చిలుకల్ని విపరీతంగా ఆకర్షిస్తాయి. వాటి లార్వాలు ఏర్పడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ పూలు ఎంత తీయగా ఉంటాయో సీతాకోక చిలుకలకేంటి, పువ్వు తెంపి చివర చప్పరించిన వారందరికీ తెలిసిందే. అందుకే ఈ చెట్టుకు తేనె పూవు చెట్టన్న పేరూ ఉందన్న మాట!
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u