Ragi uthappam Recipe:బ్రేక్ఫాస్ట్ ల్లోకి 10 నిమిషాల్లో హెల్దీ రాగి ఊతప్పం..
Ragi uthappam Recipe:రాగి ఉతప్పం.. రాగులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు లేదా మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచి ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు రాగి ఉతప్పం ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు
రాగి పిండి – 1 కప్పు
మినపప్పు – 1/4 కప్పు
అటుకులు – 1/4 కప్పు
రుచికి ఉప్పు
నూనె – 1 టేబుల్ స్పూన్
తయారి విధానం
ఒక గిన్నెలో మినపప్పు,అటుకులలో నీటిని పోసి 2 నుండి 3 గంటల పాటు నానబెట్టాలి. నానిన మినపప్పు,అటుకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని గిన్నెలోకి తీసుకోని రాగి పిండి,సరిపడా ఉప్పు,సరిపడా నీటిని పోసి బాగా కలపాలి.
ఈ పిండిని 8 గంటల పాటు అలా వదిలేసి.. ఆ తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి పిండిని అట్టులా పోసి నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. అంతే రాగి
ఉతప్పంను చట్నీతో వేడిగా సర్వ్ చేయండి.
ఇప్పుడు రాగుల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఇది పేదవాడి ఆహారం. ఇప్పుడు పెద్దోళ్లు కూడా రాగులను పడి పడి కొని తింటున్నారు. ఎందుకంటే రాగులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో రకాల సమస్యలు రాకుండా చేస్తుంది.
చిన్న ముతక గింజలా గుండ్రంగా ఉండే రాగులను పోషకాహార నిపుణులు సూపర్ ఫుడ్ గా చెప్పుతున్నారు. గుండె జబ్బుల నుండి మధుమేహాన్ని నివారించడం మరియు శరీరాన్ని బలోపేతం చేయడం వరకు.. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. రాగుల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం మరియు గ్లూటెన్ ఫ్రీ గా ఉండటం మరియు ఫినాలిక్ సమ్మేళనాలు ఉండటం వలన యాంటీ డయాబెటిక్ గా పనిచేసి డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా సహాయపడుతుంది.
రాగులలో ఉండే ఫైబర్ కడుపులో జిగట పదార్థంగా మారుతుంది. ఫలితంగా, కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. రాగులను తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని కొన్ని పరిశోదనల్లో తేలింది. రాగుల్లో ఉండే పాలీఫెనాల్స్ శరీర పనితీరును వేగవంతం చేసి యవ్వనంగా ఉండటానికి సహాయ పడుతుంది. రాగులలో కాల్షియం సమృద్దిగా ఉండుట వలన ఎముకలను ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా ఎముకలను ఉక్కులా బలంగా ఉండేలా చేస్తుంది.
రాగులను మొలకలుగా తరుచేసుకొని ఆహారంలో బాగంగా చేసుకుంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న రాగులను వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఒకప్పుడు పేదవాని ఆహారంగా ఉన్న రాగులను ఇప్పుడు అందరూ వాడుతున్నారు. అందరికి అందుబాటు ధరలో లభ్యం అవుతాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెట్టి రాగులను వాడి ఈ ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u