Weight Loss:గ్లాస్ మజ్జిగలో ఇది కలిపి త్రాగితే పొట్ట చుట్టూ కొవ్వు కరిగిపోయి స్లిమ్ గా మారతారు
Weight Loss Tips In telugu :ఉదయం నిద్ర లేవగానే కాఫీ లేదా టీ త్రాగి దినచర్యను మొదలుపెడతాం. ఉదయం పరగడుపున త్రాగటం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాఫీ,టీ లకు బదులుగా మజ్జిగ త్రాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మజ్జిగలో ఏమి కలుపుకొని త్రాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మజ్జిగలో ప్రొబయోటిక్ బాక్టీరియా ఉండుట వలన కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అల్సర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. అంతేకాక ఉదయం పరగడుపున త్రాగటం వలన జీర్ణాశయం, పేగులు శుభ్రం అయ్యి వాటిలో ఉండే హానికారక క్రిములు, బాక్టీరియా నశిస్తాయి. అంతేకాక మంచి బాక్టీరియా పెరిగి అజీర్తి, మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.
మజ్జిగలో రెండు మూడు కరివేపాకు ఆకులు, అర టీ స్పూన్ మిరియాల పొడి కలిపి త్రాగితే అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అలాగే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. భోజనం చేసాక పొట్టలో అసౌకర్యంగా ఉంటే మజ్జిగలో అల్లం రసాన్ని కలిపి త్రాగితే సమస్య పరిష్కారం అవుతుంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మజ్జిగ త్రాగి బయటకు వెళ్ళితే డీహైడ్రేషన్ బారిన పడరు.
విరేచనాలు అవుతున్న వారు ఉదయాన్నే పరగడుపున మజ్జిగలో అర టీస్పూన్ అల్లం రసం కలిపి త్రాగితే విరేచనాలు తగ్గుముఖం పడతాయి. హైబీపీ ఉన్నవారు ఉదయాన్నే పరగడుపున గ్లాస్ మజ్జిగ తాగితే ఫలితం ఉంటుంది.
మజ్జిగలో కాల్షియం, విటమిన్ బి12, జింక్, రైబోఫ్లావిన్ మరియు ప్రొటీన్లు సమృద్దిగా ఉన్నాయి. మజ్జిగ తాగడం వల్ల ఎముకలు బలపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మజ్జిగ మాత్రమే చాలా తక్కువ కేలరీల కంటెంట్ కలిగి ఉన్న పాల ఉత్పత్తి. బరువు తగ్గడంతో పాటు శరీరానికి శక్తిని అందించడంలో కూడా మజ్జిగ సహకరిస్తుంది. మధ్యాహ్న భోజనంలో 1 గ్లాసు మజ్జిగ తాగితే వెంటనే ఆకలి వేయదు.
శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మధ్యాహ్న భోజనంలో 1 గ్లాసు మజ్జిగ తాగడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. మజ్జిగ శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది, ఇది మన కాలేయం , ఇతర అవయవాలను ప్రభావితం చేస్తుంది.
ఆరోగ్యకరమైన ప్రేగు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగుకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుండి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది.
మజ్జిగలో పొటాషియం, సోడియం , కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. మజ్జిగ కొలెస్ట్రాల్ స్థాయిలు , రక్తపోటును నిర్వహించడానికి సహాయం చేయడం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. మజ్జిగ రెగ్యులర్ వినియోగం LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u