Beetroot For Face:బీట్ రూట్ తో ఇలా చేస్తే చాలు ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది
Beetroot Face Glow Tips : ఈ మధ్య కాలంలో మనలో చాలా మంది ముఖం మీద ఎక్కువగా శ్రద్ద పెడుతున్నారు. అలాగే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వటానికి కూడా సిద్దంగా ఉంటున్నారు. బీట్ రూట్ తో ఇలా చేస్తే ముఖం మీద నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం అందంగా,కాంతివంతంగా మారుతుంది.
బీట్ రూట్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. అయితే బీట్ రూట్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ విషయం మనలో కొంతమందికి మాత్రమే తెలుసు. బీట్ రూట్ లో ఉన్న పోషకాలు మృత కణాలను తొలగించి కొత్త కణాలను నిర్మిస్తాయి. అలాగే పిగ్మెంటేషన్ తొలగించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది.
ఒక చిన్న బీట్ రూట్ ని తీసుకొని పై తొక్క తీసి తురుముకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక కప్పు బాదం ఆయిల్, తురిమిన బీట్ రూట్ వేసి పది నిమిషాలు మరిగించాలి. అప్పుడు బీట్ రూట్ లో ఉన్న పోషకాలు నూనెలోకి చేరతాయి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను ముఖానికి రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.
పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వలన ముఖానికి అవసరమైన తేమ అంది ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. అలాగే కంటి కింద నల్లని వలయాలను కూడా తగ్గిస్తుంది. బాదం నూనె చర్మానికి తేమను అందించి పొడి చర్మం లేకుండా చేస్తుంది.
ఈ నూనెను ఒక్కసారి చేసుకుంటే నెలరోజుల పాటు వాడుకోవచ్చు. బీట్ రూట్, బాదం నూనె రెండు చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయ పడతాయి. ఈ చిట్కా ఫాలో అయ్యి అందమైన ముఖాన్ని సొంతం చేసుకొండి.
బాదం నూనెలో ఉన్న పోషకాలు చర్మానికి ఎలా సహాయం చేస్తాయో చూద్దాం.
విటమిన్ ఇ: యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి, విటమిన్ ఇ ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది, అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
విటమిన్ ఎ: చర్మంపై పగుళ్లు మరియు మొటిమలు వచ్చే అవకాశం ఉంది, ఇది చమురు ఉత్పత్తిని నియంత్రించడంలో మరియు సెల్ టర్నోవర్‌ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
విటమిన్ B-7: బయోటిన్ అని కూడా పిలుస్తారు, విటమిన్ B-7 జుట్టు మరియు గోళ్ల బలానికి మద్దతు ఇస్తుంది, మొత్తం చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
జింక్: జింక్ చమురు ఉత్పత్తిని నియంత్రించడం మరియు చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా బ్రేక్‌అవుట్‌లు, మొటిమలు మరియు ఇతర చర్మపు మచ్చలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు: ఈ కొవ్వు ఆమ్లాలు చర్మ అవరోధం పనితీరును ప్రోత్సహిస్తాయి, హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడం మరియు అలర్జీలు మరియు చికాకుల నుండి రక్షిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u