Olive oil For Face:ఆలివ్ ఆయిల్ ముఖానికి రాసేముందు ఈ నిజాలు తెలుసుకోండి
Olive oil in telugu :ఆలివ్ ఆయిల్ లో ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వంటల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యానికి ఆలివ్ ఆయిల్ ను చాలా మంది వాడుతున్నారు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, విటమిన్ కె,ఒమేగా 6, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
ఆలివ్ ఆయిల్ అనేది అన్ని చర్మ తత్వాలకు సెట్ అవ్వదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ రాసినప్పుడు చర్మంపై ఎక్కువగా దుమ్ము,ధూళి పేరుకుపోతాయి. దాంతో బ్లాక్ హెడ్స్,మొటిమలు వంటివి వస్తాయి. ఇక పొడిచర్మం వారి విషయానికొస్తే లిమిట్ గా ఉపయోగించవచ్చు. ఎక్కువగా ఉపయోగిస్తే చర్మంపై తేమ తొలగిపోయింది.
ఆలివ్ oil లో ఆరోగ్యకరమైన మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్ లు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మానికి నేరుగా అప్లై చేస్తే మంచి ప్రయోజనం పొందవచ్చు. ఆలివ్ నూనె తేమను లాక్ చేయడానికి సహాయపడుతుంది కాబట్టి, పొడి చర్మం ఉన్నవారికి olive ఆయిల్ చాలా బాగా సహాయపడుతుంది.
ఆలివ్ ఆయిల్‌లో స్క్వాలీన్ మరియు విటమిన్ ఇ ఉన్నాయి. స్క్వాలీన్ చర్మం యొక్క తేమ నిలుపుదలకి తోడ్పడుతుంది, అయితే విటమిన్ ఇ చర్మానికి నీటిని గ్రహించి నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోగలవు , ఇది చర్మం వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ చర్మంపై జిడ్డు అవశేషాలను తొలగించటానికి సహాయపడుతుంది. . ఇది కొన్ని రకాల మేకప్ ను తొలగించడానికి olive oil ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆలివ్ నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీమైక్రోబయల్ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది గాయం నయం చేయడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u